Uncategorized

కరోనా కొత్త కేసులు

కొద్ది రోజులుగా 40వేల దిగువకు పడిపోయిన కరోనా కొత్త కేసులు , మళ్లీ ఒక్కసారిగా పెరగడం కలవరపెడుతోంది. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 18.17లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా.. 43,263 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు 6వేల కేసులు పెరగడం గమనార్హం. కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాలలో కేసుల ఉధృతి ఎక్కువగా వుంది. కేరళలో కరోనా కేసులు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న మొన్నటిదాకా 20వేల దిగువన ఉన్న కేసులు తాజా మళ్లీ 30వేలు దాటడం గమనార్హం. ఆ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 30,196 కేసులు బయటపడ్డాయి. 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అటు దేశ వాణిజ్య రాజధాని ముంబయిలోనూ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా అక్కడ 500లకు పైగా కొత్త కేసులు బయటపడ్డాయి. ముంబయిలో ఈ స్థాయిలో కేసులు రావడం జులై 15 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం