Uncategorized

కోవిడ్ వ్యాక్సినేషణ్ వేయించుకున్న జివిఎంసి మేయర్ దంపతులు

విశాఖపట్నం, ఏప్రిల్-20 :- మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గోలగాని హరి వెంకట కుమారి దంపతులు ఇరువురూ మంగళవారం, ఆరిలోవ (FRU) డిస్పన్సరీ లో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, జివిఎంసి లో 45సంవత్సరంలు దాటిన ప్రజలు నిర్భయంగా కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకో

వాలని, మే ఒకటవ తేది నుండి 18 సంవత్సరంలు దాటిన ప్రతీ ఒక్కరికి వ్యాక్షిన్ వేయించబడుతుందని, ఎటువంటి అపోహలకు పోకుండా వ్యాక్సినేషణ్ వేయించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సినేషణ్ వేసే ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేపట్టిందని, ప్రజలు విచ్చలవిడిగా సంచరించవద్దని, బహిరంగ ప్రదేశాలలో మాస్కులు లేకుండా తిరగవద్దని, మార్కెట్లకు వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించి వెళ్ళాలని, చేతులు శుబ్రంగా కడుక్కోవాలని, వీలైనంతవరకు 60 సంవత్సరాలు దాటిన వారు ఇంటివద్ద వుండాలని, పండుగలు, శుభ కార్యక్రమాలను 50 నుండి 100 మందితో మాత్రమే జరుపుకోవాలని, కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్టులు చేయించుకొని, డాక్టరు సలహా ప్రకారం మందులు వాడాలని సూచించారు.