Uncategorizedవార్తలు

చంద్రబాబుకి సి ఐ డీ నోటీసులు

కాబినెట్ ఆమోదం లేకుండానే అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ లో చేర్చడంపై సీఐడీ కేసులు
దాదాపు 500ఎకరాల అసైన్డ్ భూముల కొనుగోళ్ళను వన్ టైమ్ సెటిల్మెంట్ లో క్రమబద్దీకరించిన చంద్రబాబు

(భారత్ వాయిస్, విశాఖపట్నం) : రాజధాని భూముల అక్రమాలకు సంబంధించి cid చంద్రబాబు నాయుడు కి నోటీసులు అందించింది. విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. 41 crpc క్రింద ఈ నోటీసులు ఇచ్చారు. మాజీ మంత్రి నారాయణలపై కూడా సీఐడీ కేసులు నమోదు చేసింది. ఏపీ సీఆర్డీఏ చైర్మన్ హోదాలో అసైన్డ్ భూముల బదలాయింపు వ్యవహారంలో కేసు నమోదు చేసినట్లు తెలిసింది. కాబినెట్ ఆమోదం లేకుండానే అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ లో చేర్చడం,
దళితులకు కేటాయించిన భూములు రాజధాని ప్రకటనకు ముందు ఇతరుల కొనుగోలు, భూ సమీకరణ ప్రకటించిన తర్వాత వాటిని కాబినెట్ అనుమతి లేకుండానే బదలాయింపు కి అనుమతించిన అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై ఇప్పుడు సిబిఐ వుచ్చు బిగించడం గమనార్హం. దాదాపు 500ఎకరాల అసైన్డ్ భూముల కొనుగోళ్ళను వన్ టైమ్ సెటిల్మెంట్ లో చంద్రబాబు క్రమబద్దీకరించారని ఆరోపనలు వినిపిస్తున్నాయి. అధికారుల అభ్యంతరాలు, సూచనలు పట్టించుకోకుండా చైర్మన్ హోదాలో నిర్ణయం తీసుకున్నట్లు సిబిఐ ఆరోపనులు చేసింది.