Uncategorized

బాధ్యతాయుతంగా ఎన్నికల విధులను నిర్వహించండి :

సమయపాలన పాటించండి… నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు
ఈ నెల 9న పోలింగ్ సామాగ్రి పంపిణీ
10 న పోలింగ్,14 న ఓట్ల లెక్కింపు

జిల్లా అదనపు ఎన్నికల అధికారి మరియు సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య..

( భారత్ వాయిస్ ,నర్సీపట్నం ) మున్సిపల్ ఎన్నికలను బాధ్యతాయుతంగా నిర్వహించాలని జిల్లా అదనపు ఎన్నికల అధికారి మరియు సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య స్పష్టం చేశారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలింగ్ అధికారులకు, సహాయ పోలింగ్ అధికారులకు ఎన్నికల నిర్వహణ పై రెండవ విడత శిక్షణా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమించిందని విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు ఈనెల 9వ తేదీన ఎన్నికల సామాగ్రిని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పంపిణీ చేస్తారని, వాటిని సకాలంలో సేకరించి నిర్దిష్టమైన సమయానికి సంబంధిత పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఎన్నికల అధికారులు రాష్ట్రఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో సేవలను అందిస్తున్నారని క్రమ శిక్షణ తో ప్రవర్తించాలనన్నారు. ఎన్నికల నియమావళికి సంబంధించిన హ్యాండ్ బుక్ ను చదివి పూర్తి అవగాహనతో ఎన్నికలను నిర్వహించాలన్నారు. ముందుగా ఎన్నికల సామాగ్రి క్షుణ్ణంగా తనిఖీ చేసి ,లోపాలుంటే సంబంధిత జోనల్ అధికారులకు సమాచారం అందిస్తే అవసరమైన సామాగ్రిని సరఫరా చేస్తారన్నారు. మార్చి పదో తేదీ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియను జాగ్రత్త గా నిర్వహించాలన్నారు. మార్చి 14వ తేదీ ఉదయం 7 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందన్నారు, ప్రతి ఒక్కరూ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని ఎటువంటి పొరపాట్లు లేకుండా ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించి, విజయవంతం చేయాలన్నారు. శిక్షణా తరగతులకు ఆలస్యంగా వచ్చిన ఎన్నికల అధికారులకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అధారిటీ మరియు మునిసిపల్ కమిషనర్ ఎన్ కనకారావు మాట్లాడుతూ పురపాలక ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశామన్నారు. ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఎన్నికలు నిర్వహించాలన్నారు. పి ఓ డైరీ సక్రమంగా నిర్వహించాలని చెప్పారు. పోలింగ్ ప్రక్రియ రహస్యంగా జరగాలన్నారు. ప్రిసైడింగ్ అధికారుల విధులు, బాధ్యతలు, బ్యాలెట్ పేపర్లు , టెండర్ బ్యాలెట్ , బ్యాలెట్ బాక్సుల సీల్ వేయు విధానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. శిక్షణా కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు బీ ఎస్ ఆర్ గోవింద, సుగుణ, పి వో లు, ఏ పి వో లు, ఈ వో లు తదితరులు హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల విధులలో వార్డు వాలంటీర్లు ప్రచారం చేస్తే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు ఎన్నికల అధికారి మరియు నర్సీపట్నం సబ్ కలెక్టర్ మౌర్య హెచ్చరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ వార్డులలో వాలంటీర్లు ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థుల తో కలసి ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఫిర్యాదులకు సంబందించి మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగిందని ఫిర్యాదులను నమోదు చేసుకొని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
84650 13255
089322 95588