Uncategorized

బిజెపి రాష్ట్ర ప్రతినిధి శ్రీ జివిఎల్ నరసింహంను మర్యాద పూర్వకంగా కలిసిన రోటరీ క్లబ్ విశాఖ పోర్ట్ సిటీ సభ్యులు

 

భారత్ వాయిస్ : రోటరీ క్లబ్ విశాఖ పోర్ట్ సిటీ సభ్యులు నేడు సూర్యా బాగ్ దగ్గర గల హోటల్ దసపల్లా లో బిజెపి రాజ్యసభ సభ్యులు, బిజెపి రాష్ట్ర ప్రతినిధి శ్రీ జివిఎల్ నరసింహంను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భముగా నరసింహం గారు మాట్లాడుతూ రోటరీ క్లబ్లు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన కొనియాడారు మరియు కోవిడ్ సమయంలో అద్భుతమైన సేవ చేసిన రోటరీ క్లబ్ విశాఖ పోర్ట్ సిటీ కృషిని మరియు రోటరీ బ్లడ్ బ్యాంక్ 24×7 ను సమర్థవంతంగా నడుపుతున్నందుకు శ్రీ జివిఎల్ నరసింహం ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కెప్టెన్ కాళీ ప్రసాద్, కార్యదర్శి విఠల్ ప్రసాద్, పిఆర్ఎస్ఐ చైర్మన్ పి.ఎల్.కె. మూర్తి, రోటరీ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ జిఎస్ రాజు, సెక్రటరీ జి. రాంబాబు, రోటేరియన్ జి. సుబ్రహ్మణ్యం, ఎం.ఎల్.సి. పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు.