Uncategorized

భోపాల్ , ఫూణె లో ఆదాయపు ప‌న్ను శాఖ సోదాలు

PIB Hyderabad
మ‌హారాష్ట్ర రాష్ట్రంలోని ఫూణెలోని సంగ‌మ‌నేర్‌కు చెందిన ఒక వ్యాపార సంస్థ‌కు చెందిన 34 భిన్న ప్ర‌దేశాల‌లో ఆదాయ‌పు ప‌న్ను శాఖ 17.02.2021లో సోదాలు నిర్వ‌హించింది. ఈ గ్రూపుకు చెందిన సంస్థ‌లు పొగాకు త‌త్సంబంధిత ఉత్ప‌త్తుల‌ ప్యాకేజింగ్‌, అమ్మ‌కాలు, విద్యుత్ ఉత్ప‌త్తి, పంపిణీ, ఎఫ్ ఎంసీజీల అమ్మ‌కాలు, రియ‌ల్ ఎస్టేట్ అభివృద్ధిలో నిమ‌గ్న‌మై ఉన్నాయి. సోదాల సంద‌ర్భంగా, చేత్తో రాసిన‌, కంప్యూట‌ర్‌లో ఎక్సెల్ షీట్ల‌లో నిర్వ‌హిస్తున్న రూ. 243 కోట్ల న‌గ‌దుకు సంబంధించి న‌మోదు చేయ‌ని‌ పొగాకు అమ్మ‌కాల వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చింది. ఇందుకు అద‌నంగా, పొగాకు ఉత్ప‌త్తుల‌కు సంబంధించిన కొంద‌రు డీల‌ర్ల‌పై చ‌ర్య తీసుకున్న క్ర‌మంలో దాదాపు రూ. 40 కోట్ల విలువైన న‌మోదుకాని అమ్మకాల వ్య‌వ‌హారం బ‌హిర్గ‌త‌మైంది. ఈ గ్రూపు రియ‌ల్ ఎస్టేట్ లావాదేవీలలో రిజిస్ట్రేష‌న్ విలువ‌కు ఎక్కువ‌గా న‌గ‌దు చెల్లింపుల‌ను అంగీక‌రిస్తోంది. దాదాపుగా రూ. 18 కోట్ల లావాదేవీల‌కు సంబంధించిన ఆధారాలు ఈ క్ర‌మంలో బ‌యిట‌ప‌డ్డాయి. అలాగే ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం, 1961లోని సెక్ష‌న్ 50 సికి సంబంధించి రూ. 23 కోట్ల మేర‌కు ఉల్లంఘ‌న‌లు జ‌రిగిన‌ట్టు క‌నుగొన్నారు. సోదాల క్ర‌మంలో, రియ‌ల్ ఎస్టేట్ అమ్మ‌కాలలో న‌మోదు చేయ‌ని లావాదేవీల ద్వారా రూ. 09 కోట్ల మేర‌కు లాభాల‌ను ఆర్జించిన‌ట్టు ప‌న్ను చెల్లింపుదారు అంగీక‌రించారు. సోదాల నేప‌థ్యంలో సుమారు 01 కోటి రూపాయ‌ల మేర‌కు లెక్క‌ల్లోకి రాని న‌గ‌దును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు, బ‌హిర్గ‌తం చేయ‌ని రూ. 335 కోట్ల ఆదాయాన్ని గుర్తించారు.
త‌దుప‌రి ద‌ర్యాప్తు ఇంకా కొన‌సాగుతోంది. భోపాల్ లోని బేతుల్‌ సోయా ప్రొడక్టు మాన్యుఫ్యాక్చరింగ్‌ గ్రూప్‌కు చెందిన మహారాష్ట్ర , కోల్‌కతాలోని ముంబై , సోలాపూర్‌లోని బేతుల్ , సత్నాలోని 22 ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ ఈ నెల 18న సెర్చ్‌, సీజర్‌ ఆపరేషన్‌ నిర్వహించింది. సెర్చ్ ఆపరేషన్ సమయంలో, భారీగా నల్లధనాన్ని గుర్తించారు. వివిధ దేశాలకు చెందిన విలువైన కరెన్సీ రూ. 44 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సెర్చ్‌ సమయంలో 9 బ్యాంక్ లాకర్లను కూడా కనుగొన్నారు. కోల్‌కతా ఆధారిత షెల్ కంపెనీల నుండి భారీ ప్రీమియంతో షేర్ క్యాపిటల్‌ను కొనడం ద్వారా సంపాదించిన 259 కోట్లను ఈ కంపెనీ లెక్కల్లో వెల్లడించలేదు. షెల్ కంపెనీలలో పెట్టుబడులను కోల్‌కతాలోని మరో షెల్ కంపెనీలకు అమ్మడం ద్వారా రూ.90 కోట్లు వచ్చినట్టు ఖాతాల పుస్తకాలలో రాసుకుంది. ఈ కంపెనీలు ఏవీ వారి చూపిన చిరునామాలో పనిచేయడం లేదని వెల్లడయింది. అటువంటి డొల్ల కంపెనీలను లేదా దాని డైరెక్టర్లనూ గుర్తించలేకపోయారు. ఈ డొల్ల కంపెనీలలో చాలా వాటిని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రద్దు చేసినట్టు గుర్తించారు. బేతుల్‌ కంపెనీ అక్రమంగా లాభాలను తగ్గించి 52 కోట్ల రూపాయల నష్టాన్ని క్లెయిమ్ చేసింది. ఈ లావాదేవీలు నిర్వహించడానికి ఉద్యోగుల పేరిట వివిధ కంపెనీలు ఏర్పడ్డాయి. వాటి మధ్య అసలు వ్యాపారమే జరగలేదు. ఈ సంస్థల డైరెక్టర్లకు అలాంటి లావాదేవీల గురించి తెలియదు. ఈ గ్రూప్ షేర్ల అమ్మకంపై వచ్చిన ఆదాయంపై 27 కోట్ల కోట్ల క్యాపిటల్‌ గెయిల్‌ వచ్చినట్టు తప్పుడు లెక్కలు చూపింది. గ్రూప్ డైరెక్టర్లు ఈ సంస్థ వాటాలను నామమాత్రపు విలువతో కోల్‌కతా ఆధారిత షెల్ కంపెనీల నుండి కొనుగోలు చేసినందున ఈ వాటాల కొనుగోలు నిజమైనది కాదని దర్యాప్తులో తేలింది. నిందితుల మధ్య చాట్లతో సహా వివిధ రకాల సాక్ష్యాలను అధికారులు సేకరించారు. వీరంతా రూ.15 కోట్ల విలువైన హవాలా పద్ధతిలో పేమెంట్స్‌ చేసినట్టు వెల్లడయింది. ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డ్రైవ్‌లు, పెన్ డ్రైవ్‌లు వంటి డిజిటల్ మీడియా డివైజ్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు ప్రకారం..నల్లధనం విలువను రూ. 450 కోట్లుగా గుర్తించారు. తదుపరి దర్యాప్తు జరుగుతోంది.