GVMC VSPUncategorized

రెండు పూటలు పారిశుధ్య కార్మీకులు విధులు నిర్వహించాలి

 జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. సృజన
భారత్ వాయిస్ :

????????????????????????????????????

విశాఖపట్నం, సెప్టంబర్-23:– రెండు పూటలు పారిశుధ్య కార్మీకులు విధులు నిర్వహించాలని జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. సృజన శానిటరీ సిబ్బందిని ఆదేశించారు. గురువారం ఆమె 4వ జోన్ 32వ వార్డు పరిధిలోని కరణంవారి వీధి, పరిసర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పారిశుధ్య సిబ్బంది రెండు పూటలు పనిచేసే విధంగా చూడాలని, పిన్ పాయింట్ వారీగా పారిశుధ్య సిబ్బందిని సర్దుబాటు చేసి ఎవ్వరికి కేటాయించిన పనిని వారిచే చేయించాలని, ప్రతి ఇంటి నుండి తడి-పొడి చెత్త సేకరణ చేసి, రోడ్లు, కాలువలు శుభ్రం చేయించాలని శానిటరీ ఇన్స్పెక్టరును ఆదేశించారు. కొన్ని ప్రాంతాలలో కాలువలు శుభం చేయక పోవడంపై శానిటరీ ఇన్స్పెక్టరును, వార్డు సచివాలయ శానిటరీ కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సేంద్రీయ ఎరువు తయారుచేస్తున్న ఇంటికి వెళ్లి ఎరువు తయారుచేసే పద్దతులను అడిగి తెలుసుకొని, వారికి కొన్ని సూచనలు ఇచ్చారు. ప్రతి రోజు చెత్త సేకరణ, త్రాగు నీరు, వీధి దీపాలు నిర్వహణ జరుగుతున్న తీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రైల్వే క్వార్టర్స్ లో ఉన్న వ్యర్ధాలను రైల్వేశాఖ వారే శుభ్రం చేసేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. రైల్వే క్వార్టర్స్ లో సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు రైల్వే శాఖ సిబ్బందితో కాని మన సిబ్బందితో గాని కలసి చేయాలని మలేరియా ఇన్స్పెక్టరును ఆదేశించారు. శుక్రవారం, “డ్రై డే” సందర్భంగా సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించుటకు ప్రతి ఇంటికి ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలతో సహకారం తీసుకోవాలని, మలేరియా సిబ్బంది, వార్డు సచివాలయ కార్యాదర్శులు, వాలంటీర్లు ప్రతి ఇంటిని సందర్శించాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ బి.వి.రమణ, ఎఎంఒహెచ్ డాక్టరు కిషోర్, కార్యనిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి, రత్నాల రాజు, టి.పి.ఎస్.ఝాన్సి, సహాయక ఇంజినీర్లు ఉషా, నాయుడు, వాసుదేవ, శానిటరీ సూపర్వైజర్ శ్రీనివాస్, మలేరియా ఇన్స్పెక్టర్ ప్రసన్న, శానిటరీ ఇన్స్పెక్టర్ కాశీ, వార్డు సచివాలయ శానిటరీ కార్యదర్శులు తదితరులు పాల్గొనారు.