Uncategorized

విశాఖలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాడులు

భారత్ వాయిస్, విశాఖపట్నం : నిషేధిత మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయన్న ప్రధాన ఆరోపణలతో నగరంలోని కొంతమంది వ్యక్తుల నివాసాలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఎఎ) బుధవారం దాడులు చేసింది. పిఠాపురం కాలనీలో నివాసం ఉంటున్న సిఆర్ పెపి ప్రతినిధి, న్యాయవాది కె.పద్మ, న్యాయవాది కెఎస్ చలం ఇంటిలోనూ ఎస్ఇఎ సోదాలు నిర్వహిస్తోంది. వీరి ఇళ్ల వద్ద ఇప్పటికే భారీగా పోలీసులు మొహరించారు. అలాగే అడ్వకేట్ బాలకృష్ణను కూడా ఏ క్షణమైనా పోలీసులు అదుపులోకి తీసుకోవచ్చనే ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. గత ఏడాది నవంబరులో విశాఖ జిల్లా, ముంచింగిపుట్టు ప్రాంత పోలీసులు ఒక మావోయిస్టు కొరియర్ గా అనుమానిస్తున్న పాంగి నాగన్నను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో అతడు ఇచ్చిన స్టేట్ మెంట్ లో మావోయిస్టు పార్టీతో సంబంధం ఉన్న సుమారు 55 మంది పేర్లు ఉన్నట్లు తెలిసింది. సదరు స్టేట్ మెంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయడం, ఆ తర్వాత కేసును ఎకు బదిలీ చేయడం జరిగింది. ఎన్ఎఎ పూర్తిగా దర్యాప్తు చేసిన పిమ్మట బుధవారం ఈ ఆకస్మిక దాడులు చేసినట్లు తెలిసింది. నిషేధిత మావోయిస్టు వ్యక్తులతో ఈ 55 మందికి అనుమానాలు ఉన్నాయనే అనుమానంతో ఈ సోదాలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొంతమంది అనుమానితుల ఇళ్లల్లో ఈ సోదాలు జరగవచ్చు.