Uncategorizedవార్తలు

విశాఖ నగర బందుకు సహకరించాలి : “గంటా”ని కోరిన విశాఖ ఉక్కు పరి రక్షణ పోరాట కమిటీ

(భారత్ వాయిస్ ,విశాఖపట్నం)
విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించు కోవాలని కోరుతూ తేదీ 05-3-2021 న విశాఖ ఉక్కు పరి రక్షణ పోరాట కమిటీ
విశాఖ నగర బందుకు నిర్ణయించుకుంది. ఈ మేరకు తమకు సహకరించాలని కోరుతూ శ్రీనివాసరావుకి వినతిపత్రం సమర్పించింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతొ పోరాడి సాధించుకున్న మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను అమ్మెందుకు కేంద్ర కాబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పటికే స్టీల్ ప్లాంట్ లోని అఖిల పక్ష కరిమిక సంఘాలు , కాంట్రాక్టు కార్మిక సంఘాలు , ఏసీ ఎస్టీ మరియు ఓ బి సి అసోసియేషన్స్ కలిపి విశాఖ ఉక్కు పరి రక్షణ పోరాట కమిటి గ ఏర్పడడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా పోరాట కమిటీ ఆధ్వర్యములో ఈ ఉద్యమమం జరుగుతున్నది. మా పోరాటానికి మద్దతుగా మీ పార్టీ కూడా అనేక రకాల ఆందోళనలు చేపడుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన రాష్ట్రంలోని ప్రజానీకం ఇప్పటికే పోరాటాలు చేస్తున్నది. అయినప్పటికి కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకో కుండా మరింత దూకుడుగా ముందుకెళుతున్నది. విశాఖ స్టీల్ అమ్మకానికి సంబంధించిన వివరాలను తయారు చేసేందుకు మినిస్టీరియల్ గ్రూప్ ను కూడా ఏర్పాటు చెసించి . ఈ నేపధ్యములో పోరాటాన్ని మరింత ఉదృతం చేసే కృషిలో భాగంగా ఫిబ్రవరి 26 న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రాస్తా రోకో కు మద్దతిచి పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియ చేస్తున్నాము. అదే విధంగా తేదీ 5-3-2021 న విశాఖ నగర బందు నిర్వహించాలని పోరాట కమిటీ నిర్ణయించింది. కావున పోరాట మేరకు జరగనున్న బంద్ కు మీ తరపున , మీ పార్టీ తరపున సహాయ సహకారాలు కోరుతున్నాము. ప్రత్యక్షంగా పాల్గొని మా పోరాటానికి మద్దతు తెలియజేయాలని కోరుతున్నాము.