Uncategorized

సింహాచలం దేవస్థానంలో ప్రజాసంబంధాల అధికారి ఏర్పాటు

(భారత్ వాయిస్, విశాఖపట్నం) : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందు అక్కడ వేంచేసి వున్న శ్రీ వరాహ నరసింహ స్వామినే దర్శనం చేసుకోవాలని వేదాలు లోనే వుంది. ఆ స్వామి వున్న విశాఖ జిల్లా సింహాచలం దేవస్థానానికి కార్య నిర్వాహక అధికారిగా రావడం ఎంతో ఆనందంగా వుంది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. దేవస్థానంలో స్వామి వారికి జరిగే పూజలు, ఉత్సవాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే సదుద్దేశంతో పబ్లిక్ రిలేషన్ ఆఫీసెర్ , ఫోటోగ్రాఫర్ లిరువురుని నియమించడం జరిగిందని కార్యనిర్వాహక అధికారి సూర్యకళ తెలిపారు. సింహాచలంలోని అడ్మినిస్ట్రేషన్ భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లడుతూ దేవస్థానం పేరు ప్రఖ్యాతులు జాతీయ ఆంతర్జాతీయ స్థాయిలో విస్తరించేలా తాను కృషి చేస్తానని అన్నారు. మీడియా కూడా తనకు సహకరించాలని కోరారు. భక్తులకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. వసతి సౌకర్యాలు మెరుగు పరుస్తానని స్పష్టం చేశారు. అనంతరం ప్రజా సంభంధాల అధికారి లోకేష్ తన వివరాలను వివరించారు. మీడియాకు ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు అందిస్తానని ఫోటోగ్రాఫర్ తెలిపారు.