Uncategorized

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ప్రాపర్టీ షో ప్రారంభం.

(భారత్ వాయిస్, విశాఖపట్నం ) : భారతీయ స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యం లో 2021 సంవత్సరం విశాఖపట్నం లో మొట్టమొదటి ప్రాపర్టీ షో  శుక్రవారం  ఏర్పాటు చేయబడింది. .విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎమ్.వీ.వీ. సత్యనారాయణ గారు ఈ ప్రాపర్టీ షో ను ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్స్ లో ప్రారంభించారు.సుమారు 50 మంది బిల్డర్లు తమతమ వివిధ రకాల ప్రోపార్టీ లను ఇందులో ప్రదర్శిస్తున్నారు.26,27 మరియు 28 తారీఖుల లో మూడు రోజులు ఈ ప్రోపార్టీ షో జరుగుతుంది.ఉదయం 10 గంటనుంచి రాత్రి 10 గంటలవరకు తెరిచి ఉంటుంది. శ్రీ ఎమ్.వీ.వీ. సత్యనారాయణ గారు మాట్లాడుతూ స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా వారు కూలంకషంగా పరిశీలన జరిపిన తరువాతనే రుణాలు మంజూరు చేస్తారు కాబట్టి వినియోగదారుల కు భవిష్యత్తులో కూడా ఎటువంటి న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం లేదని చెప్పారు. కాబట్టి ప్రజలు ఈ అవకాశం వినియోగించుకొని సొంతింటి కలను నిజం చేసుకోవాలని అన్నారు. స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా డి. జి. ఎమ్. కే.రంగరాజన్ గారు మాట్లాడుతూ అత్యుత్తమ బిల్డర్లు మరియు అత్యుత్తమ బ్యాంక్ కలిసి ఏర్పాటు చేసిన ఈ ప్రాపర్టీ షో ను వినియోగించుకోవలసిందిగా కోరారు. వినియోగదారులు సైబర్ నేరాల గురించి తెలుసుకొని జాగ్రత్త వహించాలని ఓ టి పి ని ఎవ్వరికీ చెప్పకూడదని చెప్పారు. ఈ సైబర్ నేరాలనుంచి తప్పించుకోవడానికి వినియోగదారు లందరు యోనో యాప్ ను వాడుకోవాలని ఆయన సూచించారు. స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా డిజిటల్ లావాదేవీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని అందుకు యోనో చాలా ఉపయోగ పడుతుతుందని తెలియ చేశారు. యోనో మీ మొబైల్ లో ఉంటే ఒక బ్యాంక్ శాఖ మీ దగ్గర వున్నట్లే అని ఆయన తెలిపారు.బ్యాంక్ కి వెళ్లకుండా లావాదేవీలు, షాప్ కు వెళ్లకుండా వస్తువుల కొనుగోళ్లు యోనో ద్వారా సాధ్యమని ఆయన తెలియ చేశారు. ఏ టి ఎమ్ కార్డు లేకుండా యోనో కాష్ ద్వారా ఏ టి ఎమ్ నుంచి సురక్షితంగా నగదు తీసుకోవచ్చని అందుకే అందరూ యోనో ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన తెలియచేసారు.రీజినల్ మేనేజర్లు, యూనియన్ అసోసియేషన్ నాయకులు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా సిబ్బంది పాల్గొన్నారు