ZILLAPARISHATH

జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ముంచింగిపుట్టు జెడ్ పి టి సి జల్లిపల్లి సుభద్ర

భారత్ వాయిస్ :విశాఖపట్నం, సెప్టెంబర్ 25  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ముంచింగిపుట్టు జెడ్ పి టి సి జల్లిపల్లి సుభద్ర వైయస్సార్ సిపి జడ్పీ డిప్యూటీ చైర్ పర్సన్ లుగా తుంపాల అప్పారావు (జడ్పిటిసి సబ్బవరం) మరియు బీసెట్టి వరాహ సత్యవతి (అనకాపల్లి జడ్పిటిసి) లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా కలెక్టరు ఏ. మల్లికార్జున ప్రకటించారు.  కో ఆప్షన్ సభ్యులు గా అనకాపల్లికి చెందిన పెతకంశెట్టి శివ సత్యనారాయణ జోసెఫ్, అచ్యుతాపురానికి చెందిన నరమాల కుమార వరాహ వెంకట సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.