క్రీడలు

టీమ్‌ఇండియా ఘన విజయం

అహ్మదాబాద్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్‌ 30 పరుగుల తేడాతో గెలుపు ఢంకా మోగించింది. కోహ్లీసేన 365 పరుగులకు ఆలౌటవ్వడంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఇంగ్లాండ్‌ 135 పరుగులకే చాపచుట్టేసింది. టీమ్‌ఇండియా ఆధిక్యమైన 160 పరుగులనూ సమం చేయలేకపోయింది. అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌ ఇద్దరూ ఐదు వికెట్ల ఘనత అందుకున్నారు. ఇంగ్లాండ్‌ జట్టులో డేనియెల్‌ లారెన్స్‌ (50), జో రూట్‌ (30) టాప్‌ స్కోరర్లు. 3-1తో సిరీస్‌ కైవసం చేసుకున్న టీమ్‌ఇండియా ఐసీసీ టెస్టు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది.