ఢిల్లీ క్యాపిటల్స్ సారధి రిషబ్ పంత్కు టీమిండియా మాజీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఆశిష్ నెహ్రా మద్దతు పలికాడు. సారధిగా బాధ్యతలు చేపట్టిన తొలి సీజన్లోనే పంత్ తనను తాను నిరూపించుకున్నాడని ప్రశంసించాడు. శ్రేయస్ అయ్యర్ తర్వాత ఈ ఏడాది ఢిల్లీ సారధ్య బాధ్యతలను భుజానికెత్తుకున్న పంత్.. సీనియర్లు, జూనియర్లతో సమతూకం కలిగిన జట్టును అద్భుతంగా ముందుండి నడిపించాడని పొగడ్తలు కురిపించాడు. అతనికి నిలదొక్కుకునేందుకు మరికాస్త సమయమిచ్చి, వచ్చే సీజన్లో కూడా కెప్టెన్గా కొనసాగించాలని సూచించాడు. కొన్ని తప్పిదాలు మినహా పంత్ సారధ్య బాధ్యతలకు వంద శాతం న్యాయం చేశాడని తెలిపాడు. కెప్టెన్గా పంత్కు వీలైనన్ని అవకాశాలు కల్పించాలని, అది వ్యక్తిగతంగా అతనికి, జట్టుకు ఉపయోగకరమని పేర్కొన్నాడు. కాగా, ప్రస్తుత ఐపీఎల్లో లీగ్ దశ వరకు టేబుల్ టాపర్గా నిలిచిన డీసీ జట్టు క్వాలిఫైయర్స్లో చెన్నై, కేకేఆర్ జట్ల చేతిలో వరుస ఓటములతో ఫైనల్ చేరకుండానే ఇంటి దారి పట్టింది.
రిషబ్ పంత్కు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఆశిష్ నెహ్రా మద్దతు
