వార్తలు

అనకాపల్లి అభివృద్ధి ని మరిచిన ఎమ్మెల్యే అమర్ :

జై అనకాపల్లి సేన నాయకుల విమర్శలు..
అనకాపల్లి అభివృద్ధి ని ఎమ్మెల్యే గుడివాడ ఆమర్నాధ్ మరిచిపోయారని జై అనకాపల్లి సేన నాయకులు మామిడి చిన్నారావు, బొడ్డేడ మధు, దాడి బుజ్జి తదితరులు విమర్శించారు. శనివారం స్థానిక విలేకరులతో వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి అనకాపల్లి లో ఒక ఎమ్మెల్యే కాకుండా ప్రాంతానికి ఒక ఎమ్మెల్యే తయారయార్రని గవరపాలెం ప్రాంతానికి దాడి రత్నాకర్,జయవీర్ లు సూపర్ ఎమ్మెల్యే గా వ్యవహరిస్తున్నారని, అదే మాదిరి మండల లో గొర్లి సూరిబాబు అండ్ గ్యాంగ్ ,కొత్తూరు ప్రాంతంలో బీశెట్టి జగన్ ఇలా ప్రాంతానికి ఒకరు ఎమ్మెల్యే లుగా వ్యవహరిస్తూ దోచుకు తింటున్నారని ఆరోపించారు. కొత్తూరు పంచాయతీ లో పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలు, పన్ను లు చెల్లింపుల లో అక్రమాలకు జగన్ ఊతమిస్తూ పంచాయితీ ని ఇష్టానుసారంగా దోచుకుo టున్న ఎమ్మెల్యే స్పందించక పోవడం తగదన్నారు. గొర్లి సూరిబాబు ఇసుక ర్యాంపు లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారాని ఆరోపించారు. ప్రభుత్వ భూముల్ని గ్రామాల్లో ఇష్టానుసారంగా అమ్ముకుని దోచేస్తున్నారని విమర్శించారు.మరోపక్క ప్రభుత్వ మద్యం షాపుల్లో మద్యాన్ని బార్ లకు అక్రమంగా తరలిస్తూ మద్యం మాఫియా దోచేస్తున్నారని అక్రమ సంపాదన పై దృష్టి సారించిన ఎమ్మెల్యే పట్టణ అభివృద్ధి ని మరిచారని, స్టేషన్ రోడ్డు, నూకాంబిక అమ్మవారి ఆలయం వద్ద రోడ్డు విస్తరణ పనులు నేటికి ప్రారంభం కాలేదని రోడ్డు పనులు చేపట్టే ఆలోచన ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు .ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు తో తగిన బుద్ధి చెబుతారని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.