వార్తలు

అవయవ దానం చేయండి చనిపోతూ మరొకరికి జీవితాన్ని ఇవ్వండి

డాక్టర్ ఎం. వి. విజయ శేఖర్
ఘనంగా neurotrauma wakthaon
మెరిసిన ఆర్కే బీచ్ తీరం

భారత్ వాయిస్, విశాఖపట్నం .

విశాఖనగర అందానికే మకుట మైన ఆర్కే బీచ్ తీరం ఆదివారం మరింత మనోహరంగా మారింది. నగరానికి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ ఎం.వి. విజయశేఖర్ ఆధ్వర్యంలో సుమారు 5 వందల మందితో wakathon కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న వారంతా తెల్లటి షర్ట్ లు వేసుకొని, జాతీయ జెండా పట్టుకొని ఈ కార్య క్రమంలో ;పాల్గొనడం తో బీచ్ తీరం కొత్త అందాలతో మెరిసిపోయింది. ఈ సందర్బంగా wakthaon ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. నగరంలో మూడు రోజుల పాటు neurotrauma కార్యక్రమం నిర్వ హిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ప్రతి రోజు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, అనేక మంది ప్రాణాలు కోల్పుతున్నారని ఆవేదన వ్యక్తం

 చేశారు. వీరిని దహనం, ఖననం చేయడం వలన , వీరి శరీరంలోని కళ్ళు, లివర్ , గుండే, కిడ్నీలు , మెదడు వంటి ముఖ్య భాగాలన్నీ కూడా భూమిలో కలిసి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలా కాకుండా ఆయా భాగాలను దానం చేసినట్లయితే , వాటి అవసరం వున్న వారికి వాటిని అమర్చడం ద్వారా ఆయా వ్యక్తులకు కొత్త జీవితాన్ని ఇవ్వడం తో పాటు, వారిలో చనిపోయిన వారిని చూసుకోవచ్చు అని ఏంతో భావోద్వేగంతో అన్నారు. “అవయవ దానం చేయండి చనిపోతూ మరొకరికి జీవితాన్ని ఇవ్వండి”.. అంటూ ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. తాము నిర్వ హిస్తున్న కార్యక్రమం ప్రధాన ఉద్దేశం కూడా ఇదేనని అన్నారు. neurtotrauma కార్యక్రమం లో ప్రసంగించేందుకు దేశంలోని ప్రముఖ వైద్య శాలల నుంచి వచ్చి wakathon లో పాల్గొన్న ప్రముఖ వైద్యులు కూడా organ transplantation ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ , సెయింట్ ఆంథోనీ స్కూల్ 1980-81 బ్యాచ్ విద్యార్థులు, nss , ఇతర పౌరులు పాల్గొన్నారు.