వార్తలు

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో వై ఎస్ ఆర్ సి పి ఘన విజయం

విశాఖపట్నం జిల్లాలో మొత్తం 39 జడ్పీటీసీ లకు గాను 37 చోట్ల గెలుపొందిన అభ్యర్థులను ప్రకటించారు. 35 చోట్ల వైసిపి అభ్యర్థులు గెలుపొందారు. ఒక చోట టిడిపి, ఒక చోట సిపిఎం గెలుపొందారు.

వైసిపి గెలుపొందిన జెడ్పీటీసీ లు

1.అరకులోయ 2.చింతపల్లి 3.జీకే వీధి 4.జి.మాడుగుల 5.హుకుంపేట 6.ముంచంగిపుట్టు 7.పాడేరు 8.పెదబయలు 9. డుంబ్రిగుడ 10.కొయ్యూరు 11భీమునిపట్నం 12 పద్మనాభం 13 పరవాడ 14 పెందుర్తి 15 సబ్బవరం16అనకాపల్లి 17 అచ్యుతాపురం 18 బుచ్చయ్య పేట 19.మునగపాక 20 చీడికాడ 21 చోడవరం 22 దేవరపల్లి 23 కె కోటపాడు 24 కసింకోట 25రాంబిల్లి 26 వి. మాడుగుల 27 ఎలమంచిలి 28 కోటవురట్ల 29 మాకవరపాలెం 30 నక్కపల్లి 31 పాయకరావుపేట 32 రావికమతం 33 ఎస్. రాయవరం 34.నాతవరం 35. రోలుగుంట (ఏకగ్రీవం). నర్సీపట్నంలో టిడిపి గెలుపొందగా అనంతగిరిలో సిపిఎం గెలుపొందింది. ఆనందపురం అభ్యర్థి మరణం చే ఎన్నిక నిలిపివేయబడింది.. గొలుగొండ జెడ్పీటీసీ ప్రకటించవలసి వుంది.
మన్యంలో వై ఎస్ ఆర్ సిపి ఘన విజయం
పాడేరు సెప్టెంబర్ 19 : స్థానిక సంస్థల ఎన్నికలలో వై ఎస్ ఆర్ సి పి ఘన విజయాన్ని సాధించింది. అధికార పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. వై ఎస్ ఆర్ పార్టీ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. ఆదివారం నిర్వహించిన ఎన్నికల ఫలితాలలో పాడేరు డివిజన్ పరిధిలో 11 మండలాల్లో172 ఎంపీటీసీ స్థానాలకు 3 స్థానాల్లో ఏకగ్రీవంగా ఏన్నికయ్యారు.169 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. 109మంది వైఎస్ ఆర్ సి పి అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు.26 మంది టిడిపి అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్2,బిజేపి4 సీపీఐ2,సిపిఎం3,స్వతంత్ర అభర్థులు23 విజయం సాధించారు.11 జెడ్ పి టిసి స్థానాలకు 10 మంది వైసీపీ అభ్యర్థులు, అనంతగిరి మండలంలో సీపీఐ అభ్యర్థి విజయం సాధించారు.