వార్తలు

క్రెడాయ్ ఎపి- కొత్త కార్యవర్గం ఎన్నిక

అధ్యక్షులుగా బి.రాజాశ్రీనివాస్
ప్రధానకార్యదర్శిగా కె. సుభాష్ చంద్రబోస్

(భారత్ వాయిస్ , విశాఖపట్నం )
క్రెడాయ్ ఎపి కొత్త కార్యవర్గం ఎన్నికైంది. విశాఖ నగరంలోని ఒక హెటల్ లో క్రెడాయ్ ఎపి 10వ ఏన్యువల్ జనరల్ బాడీ మీటింగ్, 23వ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ 5గురు సభ్యులు కలిగిన ఎన్నికల కమిటీ సమక్షంలో ఈ కొత్త కార్యవర్గం ఎన్నికైంది. కమిటీ చైర్మన్ గా ఎస్. వెంకటరామయ్య, అధ్యక్షులుగా బి.రాజా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కె.సుభాష్ చంద్రబోస్, ఉపాధ్యక్షులుగా పి.రాజశేఖరరావు, వై.వి.రమణారావు, ఎస్.వి.ఎమ్.చంద్రశేఖర్, కోశాధికారిగా డి.రాంబాబు, జాయింట్ సెక్రటరీలుగా పీలా కోటేశ్వరరావు, ఎం.వి.ఎస్. రామకృష్ణ, జి.రాజేంద్రరావు తదితరులు ఎన్నికయ్యారు. ఎన్నికైన కొత్త కమిటీ 2021-23 సంవత్సరాలకు అంటే రెండేళ్ల పాటు సేవలు అందిస్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ చైర్మన్ గా ఎస్. వెంకటరామయ్య, అధ్యక్షులు బి.రాజాశ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కె.సుభాష్ చంద్రబోస్, పీలా కోటేశ్వరరావు మాట్లాడుతూ నిర్మాణ రంగంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు.