వార్తలు

చంద్రబాబు కుట్రలు పంచాయతీలో పని చేయలేదు

( భారత్ వాయిస్, పశ్చిమగోదావరి జిల్లా.)
పంచాయతీలను కైవసం చేసుకొని వైఎస్ఆర్సిపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు వార్డు మెంబర్లు విజయం సాధించడం పట్ల రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సంతోషం వ్యక్తం చేశారు. పంచాయతీ పోరులో పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థులు ఘన విజయం సాధించి జిల్లాలో వైఎస్ఆర్సిపి సత్తాను మరోసారి చాటి చెప్పారని పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించిన వాటర్ మహా సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పంచాయితీ ఎన్నికలలో వైఎస్సార్ సీపీని అడ్డుకొని కుట్ర రాజకీయాలతో కుతంత్రాలు పన్నినా చంద్రబాబునాయుడు పల్లె పోరులో చతికల పడ్డారని, పల్లెలు రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన కు పట్టం కట్టాయని నాని పేర్కొన్నారు..రాష్ట్రంలో 80 శాతం పైగా పంచాయతీ లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధించిన తరుణంలో రానున్న రోజుల్లో జరిగే మున్సిపల్, జిల్లా పరిషత్ మండల పరిషత్, ఎన్నికల లో కూడా వైఎస్సార్ సిపి ప్రభంజనం సృష్టించడం ఖాయమని మంత్రి ఆళ్ల నాని ఆశా భావం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలవడానికి అహర్నిశలు పనిచేసిన పశ్చిమ గోదావరి జిల్లాలోని పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంచార్జ్ లు, వైఎస్ఆర్సిపి పార్టీ పరిశీలకులు, మండల, గ్రామ ఇన్చార్జి అందరికీ ముఖ్యంగా మహిళా నాయకులకు పేరు పేరునా అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలలో వైయస్సార్ సిపి ప్రభంజనం సృష్టించిందని 13వేల 95 పంచాయతీలకు గాను 10,536 పంచాయతీలలో వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారని రికార్డు స్థాయిలో 80 శాతం పైబడి పంచాయతీల్లో వైఎస్సార్ సీపీ విజయకేతనం ఎగురవేసిందని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయాలతో వైఎస్ఆర్సిపి దూసుకుపో గా తెలుగుదేశం పార్టీ ఘోరంగా మోట కట్టుకుందని మొత్తం పంచాయతీలలో టిడిపి కేవలం రెండు వేల పైబడి స్థానాలకే పరిమితమైందని టిడిపి 16.5 శాతంతో చతికిలపడిందని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.. ఈ ఎన్నికలతోనే రాష్ట్రంలో టిడిపి పునాదులు కదిలి పోయాయని అందరికీ అర్థం అవుతుందని, దేశంలోనే అత్యున్నత పాలన అందిస్తున్న ముఖ్యమంత్రులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన కు ఈ పంచాయతీ ఎన్నికలు దర్పణం పట్టాయని ఏడాదిన్నర లోనే ఎన్నికలలో ఇచ్చిన హామీల లో దాదాపుగా 90% నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాటుపడ్డారని దాని ఫలితమే రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలలో ప్రజలు వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్ధులను గెలిపించారని అంటే రాష్ట్ర ప్రజలు అంత వైఎస్ఆర్సిపి తోనే ఉన్నారని స్పష్టమైనట్లు మంత్రి ఆళ్ల నాని ఆరొప్పించారు. కుట్రలు, కుతంత్రాలతో ఏదో రకంగా విజయం సాధించాలని ప్రయత్నించి టిడిపి అధినేత చతికిల పడ్డారని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా ఈ ఎన్నికల ఫలితాలు ఉన్నాయని, చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అర కురవ్ స్థానాలను గెలుచుకుందని దీనితో టిడిపి బలం ఏమిటో రాష్ట్ర ప్రజలు కు అర్థం అయిందని మంత్రి ఎద్దేవా చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రోజుకు గంటలకొద్దీ పని చేసాం అని చెప్పుకునే వరని, నిజంగా ఆయన ఎంత కష్టపడితే, గత ఎన్నికలలో ప్రజలు అలాంటి ఫలితం ఎలా ఇచ్చారో ఇప్పటికైనా చంద్రబాబు గమనించాలని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు..