వార్తలు

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంనకు ఇంటింటి సర్వే

జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున

భారత్ వాయిస్, విశాఖపట్నం, అక్టోబరు 1: వన్ టైమ్ సెటిల్ మెంట్ స్కీమ్, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంనకు సంబందించి లబ్దిదారుల ఇంటింటి సర్వే నిర్వహించాల్సిందిగా జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున సంబందిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో గృహ నిర్మాణాల రుణాల కు సంబందించి వన్ టైమ్ సెటిల్ మెంట్ స్కీమ్ పై లబ్దిదారులకు తెలియజేసి వారు ఉపయోగించుకొనేలా అవగాహన కల్పించాలన్నారు. నాలుగు రకాల ఎ, బి, సి, డి కేటగిరీల లబ్దిదారులు అర్హులన్నారు. గ్రామీణ , మున్సిపాలిటీ, కార్పోరేషన్ వారిగా అర్హులైన లబ్దిదారులను గుర్తించాలన్నారు. సచివాలయాల పరిధిలో గల వాలంటీర్లు ఇంటింటి సర్వే చేసి నివేదికను పంచాయితీ సెక్రెటరీలకు అందజేయాలన్నారు. అనంతరం సంబంధిత నివేదికను డిజిటలైజేషన్ చేయాల్సి ఉంటుందన్నారు. అక్టోబరు 7వ తేదిన వై.ఎస్.అర్ ఆసరా రెండవ విడత కార్యక్రమాన్ని రాష్ట్రముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. 17వ తేది వరకు 10 రోజుల పాటు జిల్లా , నియోజక వర్గ, మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, లబ్దిదారులకు ప్రభుత్వం అందజేసే పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. రెండవ తేది శనివారం జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి శతశాతం లక్ష్యాలను చేరుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మొదటి డోసు వేసుకొనని వారికి కూడా వేయాలన్నారు. అదే విదంగా రెండవ డోసు కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఉదయం 7గంటల నుండి అన్ని సచివాలయ పరిధి, సి.హెచ్.సి, పి.హెచ్.సి లలో వ్యాక్సినేషన్ నిర్వహించాలన్నారు. డిగ్రీ కళాశాలలు ప్రిన్సిపాల్స్, కరస్ఫాండెంట్ల తో మాట్లాడి 18 సంవత్సరాలు దాటిన విద్యార్ధులకు వ్యాక్షినేషన్ వేసుకొనేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వైద్యాధికారులు, ఎం.పి.డి.ఓ.లు, తాసిల్దార్లు సమన్వయంతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అక్టోబరు 2 గాంధీ జయంతి సందర్భంగా శనివారం జగనన్న స్వచ్చసంకల్పం – క్లీన్ ఇండియా – క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి విజయవాడ నుండి లాంఛనంగా ప్రారంబిస్తున్నారని తెలిపారు. 5వ తేది నాటికి సంబందిత ఇన్ ఫ్రాస్ట్రక్చర్ , శానిటేషన్ వాహనాలు వస్తాయని, జిల్లా, నియోజక వర్గ మండల, గ్రామ పంచాయితీ స్థాయిలో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు వేణుగోపాల రెడ్డి, అరుణ్ బాబు, కల్పనాకుమారి, హౌసింగ్ పిడి శ్రీనివాసరావు తదితరులు హాజరైనారు.