వార్తలు

జెడ్ పి చైర్ పర్సన్ ఎన్నికలకు సర్వం సిద్ధం

ఏర్పాట్లను పరిశీలించిన సీఈఓ నాగార్జునసాగర్

విశాఖపట్నం, సెప్టెంబర్ 24:  విశాఖ జిల్లా జెడ్ పి చైర్పర్సన్ ఎన్నికకు అంతా సిద్ధం చేశారు. రేపు ఉదయం ఒంటిగంటకు మొదట కో-ఆప్షన్ సభ్యులు ఎంపిక జరుగుతుందనీ తరువాత జిల్లా పరిషత్ చైర్పర్సన్ ను ఎన్నుకుంటారని సీఈఓ నాగార్జునసాగర్ తెలిపారు. నిబంధనల మేరకు ప్రశాంతంగా ఎన్నిక జరిగేందుకు ప్రణాళిక ప్రకారం సమావేశ మందిరాన్ని తీర్చిదిద్దడం జరిగిందన్నారు.