వార్తలు

దేశవ్యాప్త సమ్మె- టిఎన్టియుసి పూర్తి మద్దతు

భారత్ వాయిస్, విశాఖపట్నం : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు నిరసనగా సంయుక్త కిషన్ మోర్చా ఐదు వందల రైతు సంఘాలు ఈనెల 27 వ తారీఖున భారత బందుకు పిలుపు ఇవ్వడం జరిగినది. దేశవ్యాప్త సమ్మెలో టిఎన్టియుసి పూర్తి మద్దతు ఇస్తూ ఉద్యమాలను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి కృషి చేస్తామని  రాష్ట్ర TNTUC ప్రధాన కార్యదర్శి నాగోతి శివాజీ అన్నారు. నగరంలోని తెలుగుపార్టీ కార్యాలయంలో శనివారం ఆ పార్టీ TNTUC విభాగం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. రాష్ట్ర TNTUC ప్రధాన కార్యదర్శి లెనిన్ బాబు మాట్లాడుతూ…
ముఖ్యంగా దేశంలో బిజెపి ప్రభుత్వం, ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రవేట్ పరం చేయటం నిరసిస్తూ తక్షణమే ఇటువంటి నిర్ణయాలను వెనక్కు తీసుకోవాలని tntuc డిమాండ్ చేస్తుందని అన్నారు. TNTUC రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు అప్పారావు మాట్లాడుతూ… విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలోనే కొనసాగే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తక్షణమే అఖిలపక్ష రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలతో ఢిల్లీలో ప్రధానమంత్రి తో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. TNTUC విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు విళ్లా రామోహన్ కుమార్ మాట్లాడుతూ… ఉక్కు నిర్వాసితుల నిరుద్యోగులకి బలమైన భరోసా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని, నూతనంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్ రద్దు చేయాలని, యాజమాన్యం గుర్తించే కార్మిక సంఘాలకు మాత్రమే గుర్తింపు ఇవ్వడం సరైన నిర్ణయం కాదని, tntc అభిప్రాయపడింది.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బండారు అప్పారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నాగోతి శివాజీ, కె లెనిన్ బాబు, పార్లమెంట్ అధ్యక్షులు వీళ్ళ రామ్మోహన్ కుమార్, ప్రధాన కార్యదర్శి నక్క లక్ష్మణరావు, ఉప్పిలి రామకృష్ణ, ఎం ఎస్ కృష్ణ, మాసి వెంకటరమణ మూర్తి, నెల్లి కనకమహాలక్ష్మి, ఐ ఎల్ సుగుణాకర రాజు, ఆరుగుల మణికుమార్ తదితరులు పాల్గొన్నారు