వార్తలు

* నాడు – నేడు పనులను వేగవంతం చేయాలి.

*నిర్దిష్ట ప్రణాళిక తో ముందుకు వెళ్లండి.
జాయింట్ కలెక్టర్ కె ఎస్ విశ్వనాథన్.

విశాఖపట్నం, ఆగష్టు 08: నాడు – నేడు పనులను వేగవంతం చేయాలని, నిర్దిష్ట ప్రణాళిక తో ముందుకు సాగాలని జాయింట్ కలెక్టర్ కే ఎస్ విశ్వనాథన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నాడు- నేడు పాటశాల భవనాలు, సచివాలయాలు,రైతు భరోసా కేంద్రాలు , డిజిటల్ లైబ్రరీల పురోగతి కి సంబంధించి సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లో సమావేశ మందిరం నందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎం.పి.డి ఓ లు, డి.ఈలు , ఏ.ఈ.లతో సమీక్ష నిర్వహించారు.
ఈ సంధర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ భవనాల నిర్మాణాల పురోగతి కి సంబందించి అధికారులు పని తీరును మార్చుకొని నిర్దేశించిన వారపు లక్ష్యాలను పూర్తి చేయాలని, ఒక నిర్దిష్ట ప్రణాళిక తో ముందుకు వెళ్ళడం ద్వారా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కోర్టు కేసులు మినహా మిగిలిన అన్ని చోట్ల పనులు జరగాలన్నారు. జలజీవన్ మిషన్ లో భాగంగా ఈ ఆర్ధిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు కృషి చేయాలన్నారు. వైఎస్సార్ జలకళ, అమృత్ సరోవర్ పనుల స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనికి ఆహార పథకం కింద ప్రతి గ్రామం నుంచి కూలీలను నియమించి గ్రామస్థులకు ఉపాధి హామీ కల్పించాలన్నారు. గ్రామ పంచాయితీల వారిగా సమీక్షలు జరిపి రోజు వారి కూలీల సంఖ్య పెరిగేల చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పని దినాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డిఇఓ చంద్రకళ, డ్వామా ఇంఛార్జి శ్రీనివాసరావు, పంచాయత్ రాజ్ ఎస్.ఇ, జీవీఎంసీ అధికారులు , తహశీల్దార్ లు , ఎం.పి.డి.ఓ లు సంబంధిత జిల్లా అధికారులు, పాల్గొన్నారు.