వార్తలు

నేర నియంత్రణలో అద్భుత ఫలితాలు

గంజాపై ఉక్కు పాదం
మావోయిస్టు కార్యకలాపాలకు అడ్డుకట్ట
జిల్లా సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ బి. కృష్ణారావు
నేర నియంత్రణలో ఈ ఏడాది అద్భుత ఫలితాలు సాధించామని జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు తెలిపారు. ముఖ్యంగా మావోయిస్టుల కార్యకలాపాలను అణగదొక్కడంలో నూ, గంజాయి అక్రమ రవాణా,సాగును సమర్ధవంతంగా అడ్డుకోవడంలోనూ తమ వ్యూహాలు అద్భుతంగా పనిచేశాయని సంతోషం వ్యక్తం చేశారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఈ ఏడాది క్రైమ్ రివ్యూకు సంబంధించి విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2021వ సంవత్సరం ఎంతో సవాలుతో కూడుకున్నది అయినప్పటికీ జిల్లా పోలీసు యంత్రంగా సమర్ధవంతంగా పనిచేసి ప్రజల మన్ననలను పొందిందని అన్నారు. ముఖ్యంగాలీ ఏడాది జరిగిన పంచాయతీ, మున్సిపాల్టీ, ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎలాంటి దుస్సంఘటనలకు చోటివ్వకుండా చేయడంలో మంచి ప్రతిభ కనబరిచామని అన్నారు. కోవిడ్ సమయంలో lockdown protocols నిర్వహించడంలోనూ, కోవిడ్ వైరస్ దుష్ప్రభావాలు ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ తాము సమర్ధవంతంగా పనిచేశామన్న సంతృప్తి కలిగినప్పటికీ, కోవిడ్ బారినపడి ముగ్గురు పోలీసులు మరణించడం తీవ్ర ఆవేదనను కలిగించిందని అన్నారు. ఇక మావోయిస్టుల విషయానికి వస్తే వారి కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణిచేశామన్న సంతృప్తి ఉందని అన్నారు. తాము తీసుకున్న చర్యలు వలన చాలామంది మావోలు లొంగిపోయారని, మరి కొందరిని అరెస్టు చేయడం జరిగిందని అన్నారు. ఎక్సెచేంజ్ ఆఫ్ ఫైర్ లో ఆరుగురు మావోలు చనిపోయారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గంజాయి రవాణా, సాగుపై ఉక్కుపాదం మోపినట్లు చెప్పారు. సుమారు 82 వేల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, 566 కేసులు నమోదు చేయడం ద్వారా స్మగ్లర్లకు కంటి మీద కునుకు లేకుండా చేశామని గర్వంగా చెప్పారు. సాగులో ఉన్న చాలా పంటను ధ్వంసం చేయడం జరిగిందన్నారు. అలాగే చాలా టీమ్ ను ఏర్పాటు చేయడం ద్వారా గంజాయి రవాణాకి బ్రేకులు వేశామని పేర్కొన్నారు. ఇక నేరాల విషయానికి వస్తే… 2019వ సంవత్సరంలో 6982 కేసులు, 2020లో 13058 కేసులు నమోదైతే, 2021లో కేవలం 5,803 మాత్రమే నమోదు కావడం గమనార్హమని అన్నారు. 2019వ సంవత్సరంతో పోలిస్తే 2021లో 20 శాతం కేసులు తక్కువ నమోదు కావడం గమనించాలని అన్నారు. మహిళలపై జరిగే నేరాల నియంత్రణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘దిశ’ యాప్ ను జిల్లాలో సుమారు మూడు లక్షల మంది డౌన్ లోడు చేసుకున్నారని అన్నారు. మరింతమంది డౌన్ లోడు చేసుకునేలా మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
జిల్లా పరిధిలో సైబర్ నేరాల సంఖ్య తగ్గిందని అన్నారు. పోలీసు బీట్లు పెంచడం, సిసి కెమెరాలను విరివిగా ఏర్పాటు చేయడంతో పాటు జీపీఎస్ సాంకేతిక విధానాన్ని అందిపుచ్చుకోవడంతో నేరాల నియంత్రణను సమర్ధవంతంగా చేయగలిగామని, మరింత సమర్ధవంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దొంగతనాల్లో కోల్పోయిన సొత్తులో 40 శాతం రికవరీ చేసినట్లు తెలిపారు. గత రెండు సంవత్సరాలతో పోలిస్తే రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గిందని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గడం వెనుక తాము తీసుకుంటున్న కఠిన చర్యలేనని అన్నారు. 2020 సంవత్సరంలో 536 కేసులు నమోదు అయితే, ఈ ఏడాది కేవలం 74 కేసులే నమోదు అయ్యాయని అన్నారు. మూడు గుర్తింప తగిన నేరాల్లో ఈ ఏడాది ఒకరికి యావజ్జీవ కారాగార శిక్ష పడగా, ఒకరికి 10 సంవత్సరాలు, మరోకరికి 5 సంవత్సరాలు జైలు శిక్ష పడిందని అన్నారు. సెబ్ (స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో)కు సంబంధించి సారాయి తయారీ, పులుసు ధ్వంసం తదితర విషయంలో 2460 కేసులు నమోదు చేసి 1126 మంది నిందితులను అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఈ వ్యవహారంలో 54 వాహనాలను సీజ్ చేసినట్లు చెప్పారు. ఎన్ డిపిఎల్ విషయంలో 26 కేసుల్లో 28 మంది, బెల్టు షాపులు 391 కేసుల్లో 401 మంది, ఎ డీపి ఎస్ 329 కేసుల్లో 181 మందిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఆయా వాటికి సంబంధించి 152 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు.
విశాఖపట్నం జిల్లా పోలీసు కార్యాలయంలో సంవత్సరాంతపు
పత్రికా సమావేశానికి శ్రీ ఎస్.సతీష్ కుమార్ ఐ.పి.ఎస్., జాయింట్ డైరెక్టర్ , ఎస్.ఈ. బీ. – శ్రీ బి.లక్ష్మి నారాయణ , అదనపు ఎస్.పి , క్రైమ్స్ – శ్రీ తుషార్ దూడి ఐ.పి.ఎస్., ఎ.ఎస్.పి చింతపల్లి, – శ్రీ పి .జగదీశ్ ఐ.పి .ఎస్., ఎ.ఎస్.పి పాడేరు, – శ్రీ మణికంఠ చందోలు ఐ.పి.ఎస్., ఎ.ఎస్.పి, నర్సీపట్నం, – శ్రీ బి.సునీల్, డి.ఎస్.పి, అనకాపల్లి – శ్రీ కె.ప్రవీణ్ కుమార్, డి.ఎస్.పి, డి.టి.సి – శ్రీ డి.ఎస్.ఆర్.వి.ఎస్.ఎన్.మూర్తి, డి.ఎస్.పి , .ఎస్.బి. – శ్రీ పి. శ్రీనివాసరావు, డి.ఎస్.పి , ఎస్.సి.ఎస్టీ సెల్ – శ్రీ ఏ.వెంకట రావు, డి.ఎస్.పి – ఇన్స్పెక్టర్లు శ్రీ పి .వి.వి. నరసింహారావు, శ్రీ పైడపునాయుడు, శ్రీమతి రేవతమ్మ, శీ సన్యాసినాయుడు, శ్రీ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన 20 మంది అధికారులకు ఎస్.పి నగదు రివార్డులను అందజేశారు. వారి వివరాలు.
N.Prasanth Kumar SI Annavaram, – G.Ashok Kumar, CI GK Veedhi, – A.Srinivasa Rao SI G Madugula,- B.Sudhakar CI Paderu – S.Venkata Ramana, CI Yellamanchili – M.Srinivasa Rao, SI S Rayavaram – A.Swamy Naidu, CI Koyyuru – B.Appalanaidu, SI Kothakota – Sd.Eliyas Mohammad CI Chodavaram – P.Rama Rao SI V Madugula, – K.Kumara Swamy, SI IT Core & Team – Aravinda Kishore RI Oprs, Samdani, A Supdt.DPO – M Narayan Rao SI NPM Town, G.Srinivasa Rao CI AKP (R).
SI Sabbavaram, CI DCRB, SI Ramakrishna (AKP Town), SI Ramakrishna (SBX), SI Dumbriguda