వార్తలు

ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ప్రత్యేక దృష్టి : వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి

భారత్ వాయిస్,విశాఖపట్నం, సెప్టెంబరు 21: ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి నిర్దేశించిన లక్ష్యాల మేరకు సాధించాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్.పి.లను ఆదేశించారు. గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్పరెన్స్ ద్వారా స్పందన కార్యక్రమంపై సమీక్షించారు. జగనన్న గృహనిర్మాణాలు, నవరత్నాలు- పేదలందరికి ఇళ్లు, జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం, ఎం .జి. ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ పనులు, లేబర్ బడ్జెట్, గ్రామ సచివాలయాలు, ఆర్.బి.కె.భవన నిర్మాణాలు, వై.ఎస్.ఆర్ హెల్త్ క్లినిక్ లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, వై.ఎస్.ఆర్.డిజిటల్ లైబ్రెరీల నిర్మాణపు పనులు, వై.ఎస్.ఆర్. అర్బన్ క్లినిక్ లు , గ్రామ, వార్డు, సెక్రటేరియట్ల తనిఖీలు, వ్యవసాయానికి సంబందించి ఖరీఫ్ మరియు రభీ పంటలకు సంబందించిన వివరాలు, జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష తదితర అంశాలపై సవివరంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ నెల 7 నుండి 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన వై.ఎస్.ఆర్. ఆసరా పథకాన్ని అధికారులందరు విజయవంతం చేసినందుకు అందరిని అభినంది స్తున్నానన్నారు. ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ మెటీరియల్ కాంపోనెంట్ కు సంబందించి యుద్ద ప్రాతిపధికన లక్ష్యాలనుచేరుకోవాలన్నారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టి డిశంబరు 31వ తేది నాటికి పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, డిజిటల్ లైబ్రెరీల నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. వ్యవసాయానికి సంబందించి ఈ క్రాపింగ్ చాలా ముఖ్యమని, ఆర్.బి.కె.ల పని తీరును జిల్లాకలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎప్పటి కప్పుడు తనిఖీలను చేపట్టాలన్నారు. ప్రతి నెలలో అగ్రికల్చర్ ఎడ్వైజరీ కమిటీ సమావేశాలను నిర్వహించాలన్నారు. నవంబరు నుండి రబి సీజన్ మొదలవనున్న నేపద్యంలో ముందస్తు చర్యలను చేపట్టాలన్నారు. ఆర్.బి.కె.లలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను అందుబాటులో ఉంచాలన్నారు. జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షలో భాగంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న 51 ఫైలెట్ ప్రాజెక్టులలో సర్వేను వేగవంతం చేయాలన్నారు. గ్రామ కంఠం సరిహద్దు రాళ్ల పనులను పూర్తి చేయాలన్నారు. నవంబరు 15 తరువాత ఆయా ప్రాజెక్టులను ప్రారంభించనున్నామన్నారు. 2023 సంవత్సరం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కార్యక్రమం పూర్తి చేయాలన్నారు.
వీడియో కాన్పరెన్స్ లో జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున, జాయింట్ కలెక్టర్లు ఎం .వేణుగోపాల రెడ్డి, పి.అరుణ్ బాబు, కల్పనా కుమారి, రూరల్ ఎస్.పి బి.కృష్ణారావు, జి.వి.ఎం .సి కమిషనర్ జి.సృజన, తదితరులు హాజరైయ్యారు.