వార్తలు

ప్రస్తుత పరిస్థితుల్లో రక్త దానం చాలా అవసరం…

భారత్ వాయిస్, విశాఖపట్నం : ప్రస్తుత పరిస్థితుల్లో రక్తం కొరత చాలా పెరిగింది, ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని రోటరీ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ జిఎస్ రాజు అన్నారు. జగదాంబ సెంటర్ లో ఉన్న జీషన్ రెస్టారెంట్ లో సోమవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. జీషన్ సంస్థ ప్రతినిధి భాషా ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరం లో జిఎస్ రాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్త దానం తో ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చు అన్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా బ్లడ్ బ్యాంక్ లో రక్తం కొరత చాలా పెరిగింది అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలి అని కోరారు. జీషన్ సంస్థ ప్రతినిధి భాషా మాట్లాడుతూ తమ సంస్థ సిబ్బంది, కష్టమర్లు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ఆనందంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ బ్లడ్ బ్యాంక్ సెక్రటరీ పిఎల్ కె మూర్తి, రోటరీ బ్లడ్ బ్యాంక్ మాజీ చైర్మన్ ఎం ఎం అహ్మద్ ఖాన్, రోటరీ యన్ విఠల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు