వార్తలు

భద్రాచలంలో భక్తులందరికీ నేటినుండి నిత్యం అన్నదానం


భారత్ వాయిస్ , పిడుగురాళ్ల ,  భద్రాచలం రాములోరి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుండి ఆలయంలో సంఖ్యతో సంబంధం లేకుండా భక్తులందరికీ అన్నదానం చేయనున్నారు. రోజురోజుకు భక్తుల సంఖ్య అధికంగా వస్తున్నందున దీంతో అన్నదానం టికెట్లు దొరక్క చాలామంది నిరాశ చెందుతున్నారని ఆలయ అధికారులు తెలిపారు. అందుకే భక్తులందరికీ ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గం. వరకు ఎంత మంది వస్తే అంత మందికి ఉచితంగా భోజనం పెడతామన్నారు. ఇందుకోసం బయోమెట్రిక్ విధానం అమలు చేస్తామని చెప్పారు.