వార్తలు

భారత్ బంద్ విజయవంతం

మద్దిలపాలెం నేషనల్ హైవేపై వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు నిరసన

భారత్ వాయిస్, విశాఖపట్నం : రైతు వ్యతిరేక చట్టాలు, కార్మికుల లేబర్ కోడ్లు రద్దు చేయాలని, స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాలని, పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను జిఎస్టి పరిధిలోకి తేవాలని, మోడీ కార్పొరేటర్ విధానాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు భారత్ బంద్ విశాఖ నగరంలో విజయవంతం అయింది. మద్దిలపాలెం నేషనల్ హైవేపై ఉదయం 6 గంటలనుండి సిపియం ఇతర వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింగరావు పాల్గొని మాట్లాడుతూ మోడీ విధానాలకు వ్యతిరేకంగా వాణిజ్య, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయన్నారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా, రైతులకు, కార్మికులకు వ్యతిరేకంగా విధానాలు అవలంభిస్తుందని ఎద్దేవా చేశారు. మోడీ విధానం వల్ల నాలుగు లక్షల రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. రోడ్లు, పోర్టులు, గనులు, భూములు, రక్షణ రంగం, ఆయిల్ పరిశ్రమలు, స్టీల్ ప్లాంట్, విమానాశ్రయాలు, అన్నీ అమ్మేయడానికి సిద్ధపడ్డారు. ఇది కార్మికులకే కాకా ప్రజానీకానికి తీవ్ర నష్టం. దీన్ని ప్రజానీకం చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు జిఎస్టీ పరిధిలోకి తేవాలని ప్రజలు అడుగుతుంటే మోడీ ప్రభుత్వం జిఎస్టీ పరిధిలోకి తేమని తెగేసి చెపుతోంది. కార్పొరేట్లకు లాభాలకోసమే మోడీ ప్రభుత్వం ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ ను ఒక్క అడుగు కూడా అమ్మనీయమని హెచ్చరించారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కార్పొరేట్ విధానాలు వెనక్కు తీసుకోవాలని, స్టీల్ ప్లాంట్ అమ్మే చర్యలు ఆపాలని డిమాండ్ చేశారు. ఈరోజు తుఫాను ఉన్నప్పటికీ బంద్ విజయవంతం అయ్యింది. రోడ్లుపై భారీ వాహనాలను నిలిపివేశారు. మద్దిలపాలెం జంక్షన్ లో గంట పాటు రోడ్డును బ్లాక్ చేశారు.
ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి డాక్టర్ బి.గంగారావు, సిఐటియు నగర అధ్యక్షులు ఆర్కే.యస్వీ.కుమార్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై కొండయ్య, ఎస్ యూ సి ఐ సి రాష్ట్ర కార్యదర్శి గోవిందరాజులు, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు జి వామనమూర్తి, పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.లక్ష్మి, జిల్లా కార్యదర్శి డి రోహిణి, ఐద్వా నగర ఉపాధ్యక్షులు కె.కుమారి, మద్దిలపాలెం జోన్ అధ్యక్షులు ఎం మౌనిక, సిఐటియు మద్దిలపాలెం జోన్ అధ్యక్ష కార్యదర్శులు సింహాచలం, వి కృష్ణారావు, ప్రజానాట్యమండలి నగర అధ్యక్షులు దండి నాగేశ్వరరావు, ఆర్టీసీ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ యూనియన్ నాయకులు వి. తులసిరామ్, హాస్పిటల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు పి. వెంకట్రావు, డివైఎఫ్ఐ నగర ప్రధాన కార్యదర్శి యు ఎస్ ఎన్ రాజు, ఎన్ ఎస్ ఎస్ నాయకులు కె.రవి, ఎఐటియుసి నాయకులు. B. ప్రతాప్. మళ్ళా రామకృష్ణ రావికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.