వార్తలు

ముఖ్యమంత్రి జగన్ శనివారం విశాఖకు రాక

భారత్ వాయిస్, విశాఖపట్నం, అక్టోబర్ 21: ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 23 (శనివారం) న విశాఖ నగరానికి వస్తున్నారు. తన పర్యటన అంతా నగరానికే పరిమతమయింది. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున అధికారులతో సమవాసం నిర్వహించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ముఖ్య మంత్రి పర్యటన విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఆదేశించారు. జిల్లా కలెక్టర్ డా ఎ. మల్లికార్జున, పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఆయా ప్రదేశాలలో అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ముందుగా విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి స్వాగతం, నగర ప్రముఖుల పరిచయం చేసే కార్యక్రమాలు తరువాత ఎన్ఏడి ఫ్లైఓవర్, వుడా పార్క్, శాసనసభ్యుడు కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహం జరిగే ఎంజీఎం పార్క్ ప్రదేశాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి తన పర్యటనలో ఎన్ఏడి ఫ్లైఓవర్ తోపాటు జీవీఎంసీ వీఎంఆర్డీఏ వివిధ కార్యక్రమాలను ప్రారంభం చేస్తారు.