వార్తలు

రాష్ట్రంలోని :అన్ని ప్రాంతాల అభివృద్ధికి వైకాపా కట్టుబడి ఉంది : మంత్రి బొత్స సత్యనారాయణ

( భారత్ వాయిస్, విశాఖపట్నం )

:రాష్ట్రంలోని :అన్ని ప్రాంతాల అభివృద్ధికి వైకాపా కట్టుబడి ఉంది అనీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ ను పరిపాలన రాజధానిగా , అమరావతి ని లేజిస్లేటివ్ రాజధానిగా కర్నూల్ ను న్యాయ రాజధానిగా తమ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. చంద్రబాబు ముఖ్తమంత్రిగా వున్నా సమయంలో అమరావతి
రాజధాని పెరు చెప్పి ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందన్నారు. ఇంకా ఆయన ఏమన్నారు ఆంటే అమరావతి విషయంలో ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ..ఆనాడు ఎం చెప్పారో..అదే జరిగింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆక్రమాలపై .రెండు కమిటీలు వేశామన్నారు. ఒకటి మంత్రి వర్గ ఉప సంఘము ,మరొకటి చట్ట ప్రకారం విచారణ చేసే వ్యవస్థ.. మా ప్రభుత్వానికి ఎలాంటి కక్ష సాధింపు చర్య లేదు. ఏ రోజు సీఎం అసెంబ్లీ ప్రకటించారో..ఆ రోజు నుంచి మూడు రాజధానులు ప్రక్రియ మొదలయింది.. కానీ కర్నూల్ హైకోర్ట్ విషయంలో న్యాయ పరమైన అంశాలున్నాయి. అమరావతి భూములు విషయంలో నా దగ్గరకు బలహీన వర్గాలు ప్రజలు వచ్చి ఫిర్యాదు చేశారు. సుమారు 5 వేల ఎకరాలలో అవకతవకలు జరినట్టు తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణను మేము వ్యతిరేకం .ఈ విషయాన్ని అసెంబ్లీ లో కూడా చర్చిస్తాం. అఖిల పక్షాన్ని, కార్మిక సంఘాలను తీసుకుని వస్తామని ,అన్నారు.
ఢిల్లీ లో ప్రధాని కార్యాలయాన్ని ఇప్పటికే అపాయింటమెంట్ కోరాం.ప్రధాని కార్యాలయం నుంచి సమ్మతి రావాలి.స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం తీసుకునే చర్యలకు తగినట్టు మా స్పందన ఉంటుంది. కార్మికుల పోరాటానికి మనమంతా మద్దతుగా ఉండాలి.2005 తరవాత మున్సిపాలిటీ లలో ఇన్ని స్థానాలు ఎప్పుడు ఒక పార్టీ కైవసం చేసుకోలేదు.90 శాతం సీట్లు సాధించాం. చంద్రబాబు లోకేష్ మాట్లాడుతున్న భాష , ప్రజలు చూశారు.. చంద్రబాబు రాజధాని పేరుతో ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి దోపిడీ చేసి అవినీతి చేశారు.. మీ నిర్ణయం వల్ల ఆ ప్రాంతాల అభివృద్ధికి నోచుకోకుండా పోయాయి..విలువైన అవకాశం చంద్రబాబు ఇస్తే ఏం పట్టించుకోలేదు.. ఎంత సమయం తన వాళ్లు తన వర్గం అంటూ దోపిడీ చేశారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ పై లోకేష్ పిట్ట కొంచెం కూత ఘనం, అంటూ మాట్లాడారు. అమరావతి లో జరిగిన అవినీతి పై కేబినెట్ సబ్ కమిటీ , విజిలెన్స్ వేశారు. అన్యాక్రాంతమైన భూములపై, అక్రమంగా ఇచ్చిన జీవో,ల పై అప్పటి సంబంధిత మంత్రులు, ముఖ్యమంత్రి ని అందర్నీ ప్రశ్నిస్తారు..మేము ఎప్పుడు న్యాయబద్ధంగా గెలుస్తాం..ఈ ఎన్నికల చూస్తే విజయవాడ గుంటూరు, పొమ్మన్నారు.. విశాఖ వాసులు రమ్మన్నారు తెలుస్తోంది..
దళిత రైతుల దగ్గర్నుంచి భూములు తీసుకున్నారని సుమారు వందమంది నా దగ్గరికి వచ్చారు..సుమారు ఐదు వేల ఎకరాల భూమి ఇందులో ఉందని ప్రాథమికంగా అంచనా. పవన్ కళ్యాణ్ ఏప్పుడు ఏమి అంటారు ఆయనకే తెలీదు..స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేక౦. అఖిలపక్ష సమావేశానికి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోసం వేచి చూస్తున్నా౦. చంద్రబాబు పని అయిపోయింది అని జేసీ, అందరూ అనుకున్నదే చెప్పారు..