వార్తలు

సివిల్స్ ర్యాంకర్ సాహితి పూసపాటి విద్యార్థులతో భేటీ

భారత్ వాయిస్ , విశాఖపట్నం 18 : రోటరీ క్లబ్ విశాఖ పోర్ట్ సిటీ వారు ఇటీవల యూ పి ఎస్ సి ఫలితాల్లో సివిల్స్ లో 24 వ రాంక్ సాధించిన సాహితి పూసపాటి ద్వారా అద్భుతమైన ప్రేరణాత్మక సమావేశాన్ని జి వి ఎం సి విద్యార్థుల ఉపయోగార్థం మహారాణిపేట లో గల రాక్ డేల్ హోటల్ లో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశం లో జి వి ఎం సి పాఠశాలల్లో ఎస్ ఎస్ సి టాపర్ల ను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలన్నింటికీ ఓపికగా ఆమె సమాధానాలు చెప్పారు. విద్యలో లక్ష్యాలను సాధించడంలో వారి సందేహాలను నివృత్తిచేస్తూ, యువ విద్యార్థులకు కొన్ని కీలకాంశాల లో సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థి యొక్క ఆర్థిక స్థితి ఏదైనప్పటికీ లక్ష్యాలను చేరుకోవడానికి చదువులపై ప్రభావం చూపకూడదు, ప్రతి విద్యార్థి ఎప్పుడూ టాపర్ కాలేడు. అపజయాన్ని అంగీకరించి లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువ కృషి చేయాలి, విజయాల కోసం స్థిరంగా ప్రయత్నిస్తూ ఉండ డం ద్వారా చివరికి మీరు మంచి ఫలితాలను పొందుతారు అని అన్నారు. ఆమె మాట్లాడుతూ నేను 10 వ తరగతి మరియు ఇంటర్ చదివే సమయంలో మెడిసిన్ సీటు పొందడంలో ఒక సగటు విద్యార్థిని మాత్రమే. పుస్తకాలు మరియు వార్తా పత్రికలను చదవడం వలన యు పి ఎస్ సి పరీక్షలను ఛేదించడానికి మీ పరిజ్ఞానాన్ని మెరుగుపరుస్తుంది అని తెలిపారు.
నేను గత ఐదేళ్లుగా వాట్సాప్/సోషల్ మీడియాను ఉపయోగించ కుండా యూ పి ఎస్ సి పరీక్ష కు హాజరు అయ్యేను. విజయం ప్రతి దశలో వ్యక్తులకు భిన్నంగా ఉంటుందని విద్యార్థులు లను ఉద్దేశించి పలు విషయాలను ఉటంకిస్తూ ప్రసంగించారు. అనంతరం రోటరీ క్లబ్ విశాఖ సిటీ అధ్యక్షుడు డి వి వర్మ, కార్యదర్శి ఆర్. రామ కృష్ణా రావు సాహితీ గారిని ఘనంగా సన్మానించారు. రోటేరియన్ లక్ష్మీనారాయణ మరియు రోటేరియన్ శివాజీ సాహితి పూసపాటి గారిని సభకు పరిచయం చేశారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ పూర్వ అధ్యక్షులు రోటేరియన్ కమల్ బైడ్, ఇందిరా వడ్లమాని, బ్లడ్ బ్యాంక్ ఛైర్మన్ రోటేరియన్ జి ఎస్ రాజు, P2022-23 సంవత్సరానికి ప్రెసిడెంట్ గా ఎన్నికైన రోటేరియన్ యు ఎస్ శర్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు 30 మొక్కలు అందించారు. రోటరియన్ కమల్ బైడ్ ద్వారా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు పెన్నులు బహుమతి ప్రదానం చేశారు. యూ పి ఎస్ సి యొక్క టాపర్ సాహితీ ని సత్కరించినందుకు పిల్లలందరూ చాలా సంతోషించి ఐ ఎఫ్ ఎస్ అధికారితో కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.