వార్తలు

శుభముహూర్తదర్శిని పుస్తకాన్ని ఆవిష్కరించిన విశ్రాంత ఐఎస్ అధికారి ఎల్ వి సుబ్రహ్మణ్యం.

విశాఖపట్నం :
శ్రీ శర్మదాయినీ దాతృత్వ సేవా సంఘం, విశాఖపట్నం ఆధ్వర్యంలో ద్వారకానగర్ లో గల శంకరమఠం ఆడిటోరియమ్ లో ఆదివారం సాయంత్రం శ్రీ.కొల్లూరు అప్పల సూర్యనారాయణ రచించిన “శుభముహూర్తదర్శిని” పుస్తక ఆవిష్కరణ రమ్యం గా జరిగింది, ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ. ఎల్. వీ. సుబ్రహ్మణ్యం ముఖ్య అతిధిగా విచ్చేసి పుస్తక ఆవిష్కరణ గావించి సభకు విచ్చేసిన సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ,ముహూర్తం నిర్ణయించే విధానంలో ఉభయ తెలుగు రాష్ట్రంలో గల పండితులు ఒకే తాటిపై,రావాలని తద్వారా హిందూ ధర్మం లోని ముహూర్త శాస్త్రం ఇంకా విశ్వ వ్యాప్తం అవ్వాలని అభిలాష వ్యక్తం చేశారు. శ్రీ శర్మ దాయినీ అధ్యక్షులు రాచకొండ దశరధ రామయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో, సంస్థ ప్రతినిధులు ధవల మధుసూధన రావు, సంస్థ కార్యదర్శి మధిర రాజ శేఖర్, టేకుమళ్ల అరుణ్ కుమార్ , హిమాంశు ప్రసాద్, విశ్రాంత పోలీస్ అధికారి శ్రీ రంగం దివాకర్, న్యాయవాది జయంతి ఉమామహేశ్వర రావు, విశ్రాంత ఆచార్యులు గంటి రాజగోపాల్, పి ఎల్ కె మూర్తి తదితరులు పాల్గొన్నారు.