వార్తలు

సంక్షేమ పథకాల లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలి : జాయింట్ కలెక్టరు ఎమ్.వేణుగోపాలరెడ్డి


విశాఖపట్నం, మార్చి 17: జిల్లాలో డి.ఆర్.డి.ఎ., వ్యవసాయ శాఖల ద్వారా అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాల లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని జాయింట్ కలెక్టరు ఎమ్.వేణుగోపాలరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన బ్యాంకు అధికారులతో వై.యస్.ఆర్. సున్నావడ్డీ, వై.యస్.ఆర్. చేయూత పథకాలపై సమీక్షా సమావేశాలు నిర్వహించారు. వై.యస్.ఆర్. సున్నావడ్డ్డీ పథకానికి అర్హత గల రైతులను సకాలంలో గుర్తించాలని ఆయన మాట్లాడుతూ 2019 సం.రబీలో వై.యస్.ఆర్ సున్నావడ్డీ కార్యక్రమంలో అర్హత కలిగిన రైతులు లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకుని సకాలంలో వడ్డీతో సహా పూర్తిగా చెల్లించిన రైతుల జాబితాను వెబ్ సైట్ http://karshak.ap.gov.in8080/ysrsvpr/ లో ఈనెల 25వ తేదీలోగా నమోదు చేయవలసినదిగా కోరడమైనద. ఇందులో ఇప్పటివరకు 14 వేల మంది రైతుల జాబితా నమోదు చేయడమైనది చెప్పారు. నమోదు కార్యక్రమమం తప్పనిసరిగా సకాలంలో పూర్తి చేయవలసిందిగా జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం చేయూత కార్యక్రమంలో పాడిపశువులు, గొర్రె-మేకలు, రిటైల్, వైయస్సార్ భీమా, జగనన్న తోడు కార్యక్రమాలపై బ్యాంకు రుణాల మంజూరు, లక్ష్యాల సాధనపై సమీక్షించారు. పాడి పశువులు 4398, గొర్రె-మేక 3692, చేయూత కిరాణా 1222, వైయస్సార్ భీమా 6,05,801 లక్ష్యం సాధించాలని ఆదేశించారు. లక్ష్యాన్ని ప్రణాళికా యుతంగా వివిధ శాఖల అధికారులు బ్యాంకు అధికారుల సమన్వయంతో సాధించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా) ఆర్.గోవిందరావు, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విశ్వేశ్వరరావు, వ్యవసాయ శాఖ జె.డి.లీలావతి, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనాథ ప్రశాద్, వివిధ బ్యాంకుల కంట్రోలర్ లు పాల్గొన్నారు.