CENTRAL NEWS

ఇకపై పిల్లలకూ హెల్మెట్ తప్పని సరి

ప్రమాదాల్లో పిల్లల భద్రతపై కేంద్రం దృష్టి

భారత్ వాయిస్ : ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే చిన్నారులకు సైతం హెల్మెట్‌ను(Helmet to Children) తప్పనిసరని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. పిల్లలకు కూడా వారి సైజు ప్రకారం హెల్మెట్‌లను తయారు చేయాలని హెల్మెట్ తయారీదారులను ఈ మేరకు ప్రభుత్వం కోరింది. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989 కి సవరణ ద్వారా కొత్త నియమాలు ప్రతిపాదించబడ్డాయి. కొత్తగా తెచ్చిన నిబంధనలు నాలుగు సంవత్సరాల వయస్సు వరకు పిల్లలకు వర్తించనున్నాయి. కొత్త నిబంధన ప్రకారం వీటిని ఉల్లంగించే వారిపై రూ. 1000 జరిమానాతో పాటు మూడు నెలలు జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడతాయని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు వాహనాలపై ప్రయాణించే పెద్దలకు మాత్రమే హెల్మెట్ ధరించాలనే నియమం ఉండేది. కానీ.. నేడు కేంద్రం కొత్తగా మరిన్ని నిబంధనలను ప్రకటించింది. పిల్లలతో సహా ప్రయాణిస్తున్న ఏదైనా ద్విచక్ర వాహనం.. గంటకు గరిష్ఠంగా 40 కిమీ కంటే మించిన వేగంతో ప్రయాణించకూడదు.