CENTRAL NEWS

జమ్మూ,కశ్మీర్‌ విభజన ప్రక్రియ ప్రారంభమైంది : అమిత్‌ షా

DELHI :
జమ్మూ కాశ్మీరు విషయంలో కేంద్రం చురుగ్గా ముందుకు కదులుతోంది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆ ప్రాంతం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది బీజేపీ ప్రభుత్వమే అని చెప్పాలి. ఎందుకు ఉదాహరణ హోంమంత్రి ది వ్యాఖ్యలే. జమ్మూ,కశ్మీర్‌ విభజన ప్రక్రియ ప్రారంభమైందని, త్వరలో అక్కడ ఎన్నికలు జరుగుతాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శనివారం చెప్పారు. జమ్మూ – కాశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా గురించి కూడా ఆయన కీలక ప్రకటన చేశారు. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన వెంటనే జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పిస్తామని లోక్‌సభలో హామీ ఇచ్చానని ఆయన చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జమ్మూ కాశ్మీర్ జిల్లా సుపరిపాలన సూచికను విడుదల చేసిన కేంద్ర హోం మంత్రి.. ఈ రోజు ప్రారంభించిన సుపరిపాలన సూచిక జిల్లా వ్యవస్థను మెరుగుపరచడంలో ఫలిత లక్ష్యం, బట్వాడా యంత్రాంగాన్ని రూపొందించడంలో గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తుంది. జమ్మూలో -కాశ్మీర్ ప్రజలు ఇష్టపడతారు. ఇండెక్స్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, పథకాలు, కార్యక్రమాలను జిల్లా స్థాయిలో పర్యవేక్షించేందుకు వీలవుతుందని అమిత్ షా తెలిపారు.