COLLECTORATE

పి ఎఫ్ఆర్ మిలన్ లకు పక్కా ఏర్పాట్లతో సంసిద్దతతో ఉండాలి; జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున

భారత్ వాయిస్ , విశాఖపట్నం,ఫిబ్రవరి, 16: ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్ లకు పక్కా ఏర్పాట్లుతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్లు ఎం వేణుగోపాల్ రెడ్డి, పి.అరుణ్ బాబు, జివిఎంసి కమీషనర్ లక్ష్మీషా, విఎంఆర్డిఎ కమీషనర్ వెంకట రమణారెడ్డి, పాడేరు సబ్ కలెక్టర్ అభిషేక్ లతో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, మిలన్-2022ల ఏర్పాట్లపై ఆయన బుధవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లకు ఇరువైపులా డివైడర్ లకు పెయిటింగ్ లు త్వరగా పూర్తి చేయాలని జివిఎంసి కమిషనర్ కు సూచించారు. బావికొండ రహదారి పనులు సత్వరమే పూర్తి చేయాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. ఎయిర్ పోర్ట్ వద్ద బ్రిడ్జి కి ఇరువైపులా పెయిటింగ్, తదితర మిగిలిన ఉన్న పనులను పూర్తి చేయాలని చెప్పారు. అన్ని శాఖల అధికారులు తమకు కేటాయించిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పి.ఎఫ్.ఆర్. కు ప్రెసిడెంట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, రెండు తెలుగు రాష్ల్రాల గవర్నర్లు, రాష్ట్ర ముఖ్యమంత్రి రానున్నట్లు చెప్పారు. ఏ విధమైన సమస్యలు లేకుండా అందరు అధికారులు ఎవరికి అప్పగించిన విధులు వారు నిర్వహించాలన్నారు. ముఖ్య అతిథులకు ఆహారం విషయంలో నిబంధనల ప్రకారం ఏర్పాట్లు గావించాలని సూచించారు. ప్రముఖులకు వైద్యాధికారులు మరియు ఇతర వైద్య పరమైన ఏర్పాట్లును నిబంధనల ప్రకారం
ఏర్పాటు గావించాలన్నారు. 108 సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచాలన్నారు. అగ్ని మాపక శాఖ అధికారి సిబ్బంది లేరని చెప్పగా సిబ్బంది చాలకపోతే ప్రక్క జిల్లా నుండి తీసుకోవాలని జెసి వేణుగోపాల్ రెడ్డి ఆదేశించారు. ప్రోటోకాల్ లో ఏ విధమైన తేడా ఉండకూడదని ఆదేశించారు. పక్కా ఏర్పాట్లతో సంసిద్దతతో ఉండాలన్నారు. కాన్వాయ్ లో ఏ విధమైన సమస్యలు తలెత్తరాదన్నారు. జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆహ్వానాలు పంపిణీ, రవాణా, వసతి, ఏ అధికారి ఎక్కడ ఉండాలో తెలిపారు. ఆంబులెన్స్ లు బ్లడ్ గ్రూపులు సిద్ధంగా ఉంచుకోవాలని డిఎంహెచ్ఓ, కెజిహెచ్ సూపరింటెండెంట్ లు చూసుకోవాలని, ఆహార సరఫరాను పౌర సరఫరాల అధికారి చూసుకోవాలని చెప్పారు. ప్రతీ అతిథి గృహం, హోటళ్లులలో అధికారులను ఉంటారని వివరించారు.
అంతకు ముందు నేవీ అధికారులు, జివిఎంసి, పోర్టు, తదితర అధికారులతో ఏర్పాట్లపై ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవాణా, ఆహార తనిఖీ, వసతి, సెక్యూరిటీ, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ అతిథి సింగ్, నేవీ అధికారులు కమడోర్ అసీంమిటల్, కెప్టెన్ విఎస్సి రావు, కమాండర్లు భట్టాచార్య, సుజిత్ రెడ్డి, లెఫ్ట్ నెంట్ కమాండర్ నిఖిల్ ఫెర్నాండేజ్, లెఫ్ట్ నెంట్ ఎం స్పందన రెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి, ఆర్డీవో పెంచల కిషోర్, ఉప కలెక్టర్లు రంగయ్య, ఎస్.డి. అనిత, విశ్వేశ్వరరావు, పోర్టు అధికారులు, జిల్లా అధికారులు, జివిఎంసి, విఎంఆర్డిఎ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.