COLLECTORATE

స్పందన వర్క్ షాప్ కు అందరూ తప్పని సరిగా హాజరు కావాలి

 

భారత్ వాయిస్, విశాఖపట్నం,ఫిబ్రవరి, 16: గురువారం నిర్వహించనున్న స్పందన వర్క్ షాప్ కు అంధికారులందరూ ఉదయం 8. 30 గంటలకే చేరుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో స్పందన వర్క్ షాప్ నిర్వహణ పై జిల్లా జాయింట్ ఎం. వేణుగోపాల్ రెడ్డి తో కలిసి ఆయన సమీక్షించారు.
ఈ వర్క్ షాప్ స్థానిక వి ఎమ్ ఆర్ డి ఎ సమావేశ మందిరంలో జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉన్న తాధికారులు వచ్చి పలు సూచనలు చేయడం జరుగుతుందన్నారు. జిల్లా అధికారులు, గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించిన సెక్రటరీలు, ఎంపిడిఓలు, తహసీల్దారులు, హాజరు కావాలన్నారు. స్పందన అర్జీలను ఏ విధంగా రిడ్రెస్ చేయాలి, తదితర అంశాలపై వివరించడం జరుగుతుందని తలపారు..
విఎంఆర్డిఎ హాలులో 6 కౌంటర్లు ఏర్పాటు చేయడమైనదని, అందరూ సమయానికి చేరుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అధికారులు ఉదయం 8.30 గంటలకే వర్క్ షాప్ హాలుకు హాజరై రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రాలకు సంబంధించి ట్రాన్సిట్ అకామిడేషన్ కోసం ప్రతిపాదనలు అందరు జిల్లా అధికారులు త్వరితగతిన పంపాలని చెప్పారు. ప్రతి కార్యాలయం స్వంత భవనం ఉంటే వివరాలు తెలియ జేయాలని, లేనిచో ఎంత ఎకామిడేషన్ కావాలో తెలియ జేయాలన్నారు.
జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ గురువారం ఉదయం 9.గంటలకు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని, ఎవరికి కేటాయించిన సీట్లలో వారే కూర్చోవాలన్నారు. సమావేశానికి అందరూ జిల్లా అధికారులు పాల్గొనాలని, వర్క్ షాప్ విజయవంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని తెలిపారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ అదితి సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.