ప్రజలకు మరియు పత్రిక సోదరులకు విజయ దశమి శుభాకాంక్షలు జిల్లా ఎస్పీ.
దేవి ఉత్సవాలు జరిగే దేవాలయాలవద్ద పటిష్ట బందోబస్తు.
భారత్ వాయిస్, విశాఖపట్నం : జిల్లా ప్రజలందరికీ విశాఖ జిల్లా ఎస్పీ బి.కృషారావు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరు కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ, తప్పనిసరిగా మాస్కులు ధరించి, చేతులకు శానిటైజర్ ఉపయోగించి మరియు భౌతికదూరం పాటించుచూ దశమి పండుగను జరుపుకోవాలని తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో దసరా పర్వదినాన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. దేవి నవరాత్రి ఉత్సవాలు మరియు దసరా వేడుకల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్ పరిధిలో పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. దసరా ఉత్సవాలు జరిగే దేవాలయాలు, నవరాత్రి ఉత్సవాలు జరిగే అమ్మవారి ఆలయాలు మరియు ఇతరప్రదేశాల వద్ద గట్టి నిఘా ఏర్పటుచేసేమని, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తావులేకుండా గట్టి బందోబస్తుతో పాటు ఆయా ప్రాంతాలలో దొంగతనాలు జరుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు. పండుగ సందర్భంగా ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉన్నఎడల స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.