ముంబయి: నౌకలో జరిగిన రేవ్ పార్టీ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆర్యన్ఖాన్తో పాటు అర్బాబ్మర్చంట్, మున్మున్ దమేచాను రేపటి వరకు ఎన్సీబీ కస్టడీకి తీసుకుంది. ఈ కేసులో మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ముంబయి మీదుగా గోవా వెళ్తున్న క్రూయిజ్ నౌకలో జరుగుతున్న రేవ్ పార్టీలో మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారనే సమచారంతో ఎన్సీబీ అధికారులు ఈరోజు తెల్లవారుజామున తనిఖీలు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
NCB కస్టడీకి షారుఖ్ ఖాన్ కుమారుడు
