endowment

కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ధర్మకర్తల మండలి సభ్యుడుగా నండూరి సుభ్రమణ్యం

భారత్ వాయిస్, విశాఖపట్నం 31 డిసెంబర్ 2021 : శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ధర్మకర్తల మండలి సభ్యుడుగా నండూరి సుభ్రమణ్యం నేటి ఉదయం దేవాలయ ప్రాంగణంలో పదవి ప్రమాణం చేసారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమతి జ్యోతి మాధవి గారు నండూరి సుభ్రమణ్యంతో ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఆలయ చైర్మన్ కొల్లి సింహాచలం సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతం రాజు సుధాకర్, ప్రత్యేక అతిధులుగా వి ఏం ఆర్ డి ఎ ఛైర్మన్ శ్రిమతి అక్కరమాని విజయనిర్మల, శాసన మండలి సభ్యులు వంశీ కృష్ణ శ్రీనివాస్, వై ఎస్ ఆర్ సి పి యువనాయకుడు ద్రోణంరాజు శ్రీవాత్సవ, ఏపీ కళింగ వెల్ఫేర్ అండ్ డలవలప్ మెంట్ రాష్ట్ర డైరెక్టర్ బి.పద్మావతి, ఆలయ ధర్మకర్త ధనలత, మాజీ కార్పొరేటర్ జగ్గుపిల్ల అప్పలరాజు, ఆలయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వి. రాంబాబు , విశ్రాంత పోలీస్ అధికారి టి. ఎస్. ఆర్ ప్రసాద్ , వై సి పి నాయకులు కావూరి చరణ్ కుమార్, ప్రముఖ న్యాయవాది కే.వి. రామ మూర్తి, పబ్లిక్ రిలేషన్స్ సొసైటి ఆఫ్ ఇండియా విశాఖపట్నం చాప్టర్ అద్యక్షులు పి.ఎల్. కే.మూర్తి, శంకర్ నీలు, టేకుమళ్ళ అరుణ్ కుమార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామారావు, సిబ్బంది గుడివాడ శ్రీనివాస రావు, మోహన రావు, శ్రీవర్మ, సి హెచ్ వి రమణ,మాజీ ట్రస్టీ రాచకొండ మెహతాజీ, సి హెచ్ వెంకటేశ్వర రావు, కడియం ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. వేద పండితులు బ్రహ్మశ్రీ ఎం. భీమశంకర శాస్త్రి, కె శ్రీనివాస శర్మ, పంచముఖి శర్మ వేద ఆశీర్వచనం చేసారు. ప్రమాణ స్వీకార అనంతరం నండూరి సుభ్రమణ్యం మరియు అతిధులు కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. పదవీ స్వీకారం చేసిన అనంతరం నండూరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ పదవి నియామకం చేసిన ముఖ్య మంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డికి గారికి, రాజ్య సభ సభ్యులు శ్రీ విజయ సాయి రెడ్డి గారి నా దన్యవాదములు తెలియచేసారు.