endowment

సింహాచలం దేవస్థానానికి రూ.10 లక్షల విరాళం

ఈఓ సూర్యకళకు కోరమండల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ అరుణ్ అలగప్పన్ హామీ

సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారిని కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ అరుణ్ అలగప్పన్ తన కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ లతో కలిసి దర్శించుకున్నారు. వారికి దేవస్థానం ఈఓ సూర్యకళ, ఏఈఓ ఆనంద్ కుమార్ , ఇతర అధికారులు స్వాగతం పలికారు. వారికి వేద ఆశీర్వాదం, స్వామివారి ప్రసాదాలను అందించారు. ఈ సందర్బంగా విజిటర్స్ బుక్ లో స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అలగప్పన్ రాశారు ఆలయంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అరుణ్ అలగప్పన్ కు ఈఓ సూర్యకళ వివరించారు. దేవస్థానం పరిసరాలను, పరిశుభ్రతను చూసి ఆశ్చర్యపోయారు. స్థల పురాణానాన్ని వవరించడంతోపాటు ఆలయం, కళ్యాణ మండపాన్ని కోరమండల్ టీంకు చూపించారు. ఈఓ చిస్తున్న కార్యక్రమాలకు ముగ్ధులై దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలకు రూ.10,00,000 (పది లక్షల రూపాయలు) వితరణను ఆయన పేర్కొన్నారు. ఈఓకు అలగప్పన్ హామీ ఇచ్చారు. ఆలయంలో ఇటీవలే జరిగిన అభివృద్ధిని చూసి … మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని EOను కోరారు . వారంలో చెక్స్ ఇచ్చేస్తానన్నారు. అంతేకాదు భవిష్యత్ లో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతామని హామీ ఇచ్చారు. అరుణ్ అలగప్పన్ తోపాటు కోరమండల్ కంపెనీ ఎండీ సమీర్ గోయల్, దినేష్ (జీఎం- ఆపరేషన్స్ ), శంకర్ సుబ్రమమ్యం , బిజినెస్ హెడ్, రంగ కుమార్ (సీనియర్ జనరల్ మేనేజర్ HR), జయశ్రీ శటగోపన్, సీఎఫ్ ఓ, కాలిదాస్ ( ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మార్కటింగ్) , రంగకుమార్ సీనియర్ జనరల్ మేనేజర్… సింహాద్రినాథుణ్ణి దర్శించుకున్నారు.