GVMC VSP

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొదటి తీర్మాణం

 హర్షం ప్రకటించిన అన్ని పక్షాలు

సుజావుగా సాగిన జీవీఎంసీ మొదటి పాలకవర్గం సమావేశం

భారత్ వాయిస్, విశాఖపట్నం : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ పాలకవర్గం, తన మొదటి సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మాణం చేసింది. పాలకపక్షంతో పాటు, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, వామపక్షాలు, జన సేన, బీజేపీ కార్పొరేటర్లంతా చప్పట్లతో ఈ తీర్మాణానికి జై కొట్టారు. జీవీఎంసీ మొదటి పాలకవర్గ సమావేశం శుక్రవారం సమావేశహాలులో జరిగింది. ఈ సందర్భంగా వైకాపా నాయకులు, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు, కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు, కాకి గోవిందరెడ్డి, గంధం శ్రీనివాసరావు, సిపిఎం కార్పొరేటర్ గంగారావు, సిపిఐ కార్పొరేటర్ స్టాలిన్,జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తదితరులంతా స్టీల్ ప్లాంట్ విశిష్టతను కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మణిహారంగా ఉన్న స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడం వలన దాని ప్రభావం ఈ ప్రాంత అభివృద్ధి పై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్ సిటీగా పేరొందిన విశాఖలోని అత్యధికులు ప్లాంట్ పై ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఆధారపడి జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఉండటానికి దిల్లీలో పార్లమెంట్ సభ్యులుగా తాము చేస్తున్న కృషిని ఎంపీ సత్యనారాయణ వివరించారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా పరుగులు తీస్తున్న విశాఖకు స్టీల్ ప్లాంట్ ఒక మణిహారమని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ అన్నారు. ఈ సంస్థను కాపాడుకునేందుకు ఎపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రానికి అనేక లేఖలు రాయడం జరిగిందన్నారు. అవసరమైతే స్టీల్ ప్లాంట్ ను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందేనని అమర్ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మనోభావాలకు ప్రతీకగా విశాఖ స్టీల్ ప్లాంట్ నిలుస్తుందని, ఎంతోమంది త్యాగ ఫలితంగా లభించిన ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందని అన్నారు. అందరి సూచనలను పరిగణలోకి తీసుకున్న మేయర్ గొలగాని హరివెంకట కుమారి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తీర్మానిస్తూ,దానిని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పంపిస్తామని ప్రకటించారు. కౌన్సిల్ కు హాజరైన పలువురు నాయకులు సభ ఆరంభంలోనే దివంగత నాయకులు ద్రోణంరాజు శ్రీనివాస్, కార్పొరేటర్ గా ఎన్నికై మరణించిన బొట్టా సూర్యకుమారి, మరో ఇద్దరికి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వైకాపా నాయకులు, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు, కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు, కాకి గోవిందరెడ్డి, గంధం శ్రీనివాసరావు, సిపిఎం కార్పొరేటర్ గంగారావు, సిపిఐ కార్పొరేటర్ స్టాలిన్, జన సేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తదితరులంతా ద్రోణంరాజు సేవలకు గుర్తుగా ఈ ప్రాంతంలో ఒక ప్రాంతానికి ఆయన పేరును పెట్టాలని సూచించారు. అనంతరం వివిధ సమస్యలపై కార్పొరేటర్లు తమ గళాన్ని వినిపించారు. అమర్ వ్యాఖ్యలతో దేశం చిర్రుబుర్రు: అనకాపల్లి నాయకులు సమావేశంలో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తమ నాయకులు ముఖ్యమంత్రి జగన్ తీవ్రంగా శ్రమిస్తున్నారనీ, రాష్ట్రంలో ‘హెుదా’, దిల్లీలో ప్యాకేజీ మాట్లాడుకునే నాయకుడు కాదని వ్యాఖ్యానించారు. దీంతో తెలుగుదేశం నాయకులు మూకుమ్మడిగా దండెత్తారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. అయితే పరిస్థితిని గ్రహించిన మేయర్ వెంటనే స్లీల్ ప్లాంట్ నికి వ్యతిరేకంగా తీర్మాణం పై వ్యాఖ్యానించడంతో సభ సద్దుమణిగింది.