GVMC VSP

గ్రేటర్‌ విశాఖ నగర పరిధిలో రోడ్లు అన్ని గుంతలు : కార్పొరేటర్ డా॥ బి.గంగారావు

భారత్ వాయిస్, విశాఖపట్నం :

నగరంలోని రోడ్స్ పరిస్థితి దారుణంగా వుంది. ప్రతి రోడ్డు గుంతల మాయం అయిపోయాయి. దీనిపై ఏ ఒక్క కార్పొరేటర్ స్పందించక పోయినా 78వ వార్డు సిపిఎం కార్పొరేటర్ డా॥ బి.గంగారావు మాత్రం తన ఆవేదనను జీవీఎంసీ మేయర్ హరి వెంకట కుమారి ఎదుట వ్యఖం చేశారు. ఈమేరకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అందులో ” గ్రేటర్‌ విశాఖ నగర పరిధిలో రోడ్లు అన్ని గుంతలు, గొయ్యిలు పడి పూర్తిగా పాడైపోయాయి. ప్రధాన రహదారులే కాకుండా నివాస ప్రాంతాల రహదారులు కూడా పాడై పోయాయి. ప్రధాన రహదారులు అన్ని గుంతలు, గొయ్యిలు తో నిండి ఉండటం వలన వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు ప్రమాదాలు జరుగుచున్నాయి. ఇటీవలె కుర్మన్నపాలెం లో ఒక లారీ రోడ్‌ మీద  వున్న గుంత తప్పించపోయి  ప్రక్కన వస్తున్న ద్విచక్ర వాహనదారునీ గుద్దటం వల్ల అక్కడికక్కడ చనిపోయారు.. ఇలాంటివి ప్రతి రోజూ నిత్యకృత్యంగా మారాయి. వాహన దారులు నరక యాతన పడుతున్నారు. కేంద్రప్రభుత్వం తన భాధ్యతగా వున్న జాతీయ రహదారులు బాగుచేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ తీరు కేంద్ర బీజేపీ తరహా లోనే వున్నది. ప్రజలను నరక యాతన పెట్టటం సమంజసం కాదు.
గత కౌన్సిల్‌ సమావేశం లో కార్పొరేటర్‌లందరూ జీవిఎంసి పరిధిలోని రహదారులన్ని పాడై పోయాయి అని , వెంటనే నిధులు కేటాయించి రహదారులు బాగుచేయాలని కోరారు. అనేక మంది వారి వార్డుల పరిధిలో ఉన్న రోడ్లను బాగు చేయడం కొరకు నిధులు మంజూరు చేయాలని మీకు లెటర్స్‌ కూడా పెట్టారు. వాటి మీద కనీసం స్పందించ లేదు. కౌన్సిల్‌ లో వాటిని ఆమోదం కోసం అజెండా కూడా పెట్టటం లేదు. ప్రతి వార్డు లోని రహదారుల మరమ్మత్తుల కోసం కోటి యాభై లక్షలు మంజూరు చేస్తున్నట్లు మీరు ప్రకటించారు. కానీ అది కూడా ఆచరణకు నోచుకోలేదు.. 4200కోట్ల జి వి ఎం సి బడ్జెట్లో కనీస నిధులు రోడ్స్‌ మరమత్తులు కొరకు కేటాయించక పోవడం ఆందోళన కలిగిస్తుంది.  ప్రజలు వివిధ పన్నుల ద్వారా చెల్లిస్తున్న సొమ్మును ప్రజల అభివృద్ధికి ఖర్చు పెట్టటం లో తీవ్ర అశ్రద్ధ చేయడం మంచిది కాదు.కనుక ఏటువంటి జాప్యం లేకుండా వెంటనే రోడ్లు నీ బాగు చేయడం కొరకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ” అని పేర్కొన్నారు.