Uncategorized

గులాబ్ తుపాన్ సహాయ కార్యక్రమములో “అక్షయ పాత్ర ” వితరణ

భారత్ వాయిస్, విశాఖపట్నం : గులాబ్ తుపాన్ కారణముగా విశాఖపట్నంలో అనేక ప్రాంతములు నీటమునిగి భోజనము వండుకొనుటకు అవస్థపడుతున్న వారి కొరకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యములో విశాఖ మహానగరంలో వివిధ ప్రాంతాలలో భోజన పొట్లములు మరియు మజ్జిగ వితరణ చేయడం జరిగింది . ఈ కార్యక్రముమును విశాఖపట్నం మండల తాసీల్ధార్ వారి సూచన మేరకు కంచరపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో గల వంట శాల లో భోజనం తయారుకావించి అక్షయ పాత్ర భోజన సరఫరా వాహనముల ద్వారా వివిధ ప్రాంతాలకు సరఫరా చేయడం జరిగింది .
ఈరోజు కంచరపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్ వంట శాల నుంచి 8000 భోజన పాకెట్స్ మరియు మజ్జిగ పాకెట్స్ పంపిణి చేయబడిన ప్రాంతాలు

1. శ్యాం నగర్ కాలనీ , మర్రిపాలెం

2.మహారాణి వీధి , మర్రిపాలెం

3.నలందానగర్ , ఊర్వశి దగ్గర

4.గజపతినగర్ , మర్రిపాలెం

5.సంకురు పేట , ఐ టి ఐ దగ్గర

6. రామ్ జి ఎస్టేట్

7. మాధవ దార నిర్వాసితుల కేంద్రం

8. కప్పరాడ

9.ఆర్ పి పేట నిర్వాసితుల కేంద్రం

10. భూపేష్ నగర్ నిర్వాసితుల కేంద్రం

11.ఏ ఎస్ ఆర్ కాలనీ నిర్వాసితులు

12. కోట వీధి

13.జాలరి పేట

14.గవర్నమెంట్ చెస్ట్ హాస్పిటల్

15.గవర్నమెంట్ మెంటల్ హాస్పిటల్

16.విమ్స్ హాస్పిటల్

17.విక్టోరియా హాస్పిటల్

18. రోడ్ ప్రక్కన నివసించు నిరాశ్రుయులు

అక్షయ పాత్ర ఫౌండేషన్ స్వచ్చంద కార్యకర్తలు , ప్రభుత్వ అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి భోజన పాకెట్స్ పంపిణి చేయడం జరిగింది .
ఈ కార్యక్రమము డాక్టర్ నిష్క్రించిన భక్త దాస గారు ప్రెసిడెంట్ అక్షయ పాత్ర ఫౌండేషన్ వారి ఆధ్వర్యములో నిర్వహించడం జరిగింది .