Uncategorized

ఘనంగా అభయ ఆంజనేయ స్వామివారి తీర్థ మహోత్సవాలు…

పాలాభిషేకం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు…..
ఐదువేల మందికి అన్న సమారాధన…..

(భారత్ వాయిస్ , నర్సీపట్నం) ఫిబ్రవరి24.:
నర్సీపట్నం ఫైర్ స్టేషన్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి తీర్థ మహోత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ వ్యవస్థాపకులు తోటకూర రామరాజు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈఉత్సవాల్లో మాజీ మంత్రివర్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసి పాత్రుడు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామివారి ప్రసాదాన్ని స్వయంగా భక్తులకు వడ్డించారు ఈ సందర్భంగా ఐదువేల మందికి అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద ఉదయంనుండి సాయంత్రం వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను కనులపండువుగా ఏర్పాటు చేశారు అదేవిధంగా వేకువజామునుండి స్వామివారికి తమలపాకులతో అష్టోత్తర పూజలు పాలాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు నర్సీపట్నం పరిసర ప్రాంతాలైన బలిఘట్టం, లింగాపురం, కళ్లెంపూడి, కృష్ణాపురం, పెదబొడ్డేపల్లి, బైపురెడ్డిపాలెం మొదలైన ప్రాంతాల భక్తులు శ్రీఅభయాంజనేయ స్వామిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు