Uncategorized

రాష్ట్రం కోసం చాలాసార్లు తగ్గా

భారత్ వాయిస్, అమరావతి:

రాష్ట్రం కోసం చాలాసార్లు తగ్గానని, ఈసారి మిగతావాళ్లు తగ్గితే బాగుంటుందన్నారు. 2014, 2019లో తగ్గాం.. 2024లో తగ్గేదే లేదని పవన్ తేల్చిచెప్పారు. జనసేన ముందు మూడు ప్రత్యామ్నాయాలున్నాయని పేర్కొన్నారు.
జనసేన-బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదా జనసేన-టీడీపీ-బీజేపీ కలిసి ప్రభుత్వం స్థాపించడం లేదా జనసేన సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అని చెప్పారు. ఈ మూడు ప్రత్యామ్నాయాలపై చర్చిద్దామని,పవన్ సూచించారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పొత్తు నేపథ్యంలో తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటిస్తుందనేది ఎవరి ఆశ అయినా కావొచ్చునని పవన్‌ వ్యాఖ్యానించారు. తనకు మాత్రం అలాంటి ఆశ లేదన్నారు. దీనిపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ… ‘‘బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారనే విషయం నాకు తెలియదు. దీని గురించి నాతో మాట్లాడలేదు’’ అని పవన్‌ వ్యాఖ్యానించారు. ఒంటరిగానే పోటీచేసి మళ్లీ అధికారంలోకి వస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారని చెబుతూ… ‘‘ఒంటరిగా పోటీ చేసే మీకు… ప్రత్యర్థి పార్టీలు ఎవరెవరు కలిస్తే మీకెందుకు?’’ అని పవన్‌ ప్రశ్నించారు.