Uncategorized

సమాజ గుండెచప్పుడుగా పత్రికలు నిలవాలి

నిజం పత్రిక వార్షికోత్సవ వేడుకల్లో గ్రేటర్ మేయర్ హరి వెంకట కుమారి

భారత్ వాయిస్, విశాఖపట్నం :
సామాజిక బాధ్యతతో నడిపే పత్రికలకు ఎల్లప్పుడూ ప్రజాదరణ ఉంటుందని గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ఉద్ఘాటించారు. పత్రికలు సమాజ గుండెచప్పుడుగా నిలవాలని ఆమె ఆకాంక్షించారు. బీచ్ రోడ్డులోని ఓ హోటల్లో నిజం పత్రిక 7వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మేయర్ హరి వెంకట కుమారితో పాటుగా మారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి, జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు, సెంచూరియన్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ జీఎస్ ఎన్ రాజు, కార్పొరేటర్లు పెద్దిశెట్టి ఉషశ్రీ, రెయ్యి వెంకట రమణ, శరగడం రాజశేఖర్ వైసీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, సీనియర్ జర్నలిస్టు శివశంకర్ లు హాజరయ్యారు. నిజం పత్రిక 7వ వార్షికోత్సవం సందర్ఫంగా రూపొందించిన ప్రత్యేక సంచికను మేయర్ హరి వెంకట కుమారి ఆవిష్కరించి ఇతర అతిథులుకు అందజేాసారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ప్రస్తుతం తరుణంలో మీడియా వ్యవస్థ అనేక సంక్షోభ సమయాన్ని ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేసారు. ఆర్థికంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ వృత్తి ధర్మాన్ని మాత్రం విస్మరించకుండా ముందుకు వెళడం అభినందనీయమన్నారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం మీడియా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారథిగా పని చేసి గురుతర బాధ్యతను నిర్వర్తించిందన్నారు. మారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకట రెడ్డి మాట్లాడుతూ, సమాజ పురోగతిలో జర్నిలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ప్రజల అజెండానే తమ అజెండాగా పత్రికలు సాగిస్తున్న పోరాటం అనిర్విచనీయమన్నారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ, బి. రవికాంత్ సారథ్యంలో విజయవంతంగా ప్రచురితమవుతున్న నిజం పత్రిక ఏడు సంవత్సరాలను పూర్తి చేసుకుని మరో నవ వంసతంలోకి అడుగుపెడుతున్న శుభసందర్భమని కొనియాడారు. సెంచూరియన్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ జీఎస్ ఎన్ రాజు మాట్లాడుతూ, సమాజంలో చైతన్యం తీసుకువచ్చేది పత్రికలేనని వివరించారు. భారతదేశం పురోగతిలో పత్రికల పాత్ర కీలకమని గుర్తు చేసారు. కార్పొరేటర్లు ఉషశ్రీ, రెయ్యి వెంకటరమణ మాట్లాడుతూ, ప్రజల పక్షాన నిజం పత్రిక ప్రచురించిన అనేక కథనాలు సమాజంలో అనేక మార్పలు తీసుకువచ్చిందన్నారు. అవినీతి,అక్రమాలను చెండాడుతూ ముందుకు సాగుతున్న నిజం పత్రిక మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం రెల్లి తెగల హక్కుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు అరియాల సురేశ్, ప్రభా క్రికెట్ అధినేత ప్రభాకర్ లను నిజం పత్రిక అధినేత రవికాంత్ తో కలసి అతిథులంతా ఘనంగా సత్కరించారు.